![Singer Sunitha Reacts On Pregnancy Rumours - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/15/Sunitha.jpg.webp?itok=_gIj7xmW)
తన మాటే ఒక పాటలా అనిపిస్తుంది అభిమానులకు. అలాంటిది ఆమె పాడుతుంటే అచ్చంగా అమృతం కురిసినట్లుంటుంది. అంతటి మధురమైన గొంతు ఉన్న గాయని మరెవరో కాదు సునీత. తీయటి స్వరం, చక్కని రూపం, అద్భుత గానంతో అలరిస్తున్న ఆమె త్వరలో తల్లి కాబోతుందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై సునీత స్వయంగా స్పందించింది.
'నేను ప్రెగ్నెంటా? ఆ విషయం నాకే తెలియదు. అలా రూమర్ పుట్టిస్తున్నారు అంటే వారి ఆలోచనా విధానానికే వదిలేస్తున్నా. వారు నన్ను, నా జీవితాన్ని ఏం చేయలేరు' అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే సునీత తనయుడు ఆకాశ్ హీరోగా పరిచయం కానున్నాడు. సర్కారు నౌకరి అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్‌కే టెలీషో బ్యానర్‌పై కె.రాఘవేంద్రరావు నిర్మిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment