సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
న్యూయార్క్: ప్రపంచ ప్రఖ్యాత ధనవంతులు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్‌లు మీడియాలో కనపడటం అత్యంత అరుదు. ఏదైనా అత్యవసరమైన పని అయితే తప్ప మీడియా ముందుకు రారు. అలాంటి వీరిద్దరికి సంబంధించిన ఓ పాత ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. థంగ్ ఫాన్ అనే ట్విటర్ ఖాతాదారుడు పోస్ట్ చేసిన ఈ ఫొటో 2004 సంవత్సరానికి చెందినది. ‘‘ ఈ ఫొటో 17 ఏళ్ల క్రితందంటే నమ్మటం కష్టం. 2004లో అంతరిక్షం గురించి మాట్లాడుకోవటానికి ఏర్పాటు చేసిన డిన్నర్‌లో ఇద్దరూ పాల్గొన్నారు.
వీళ్లిద్దరూ వ్యక్తిగతంగా కలుసుకున్న అత్యంత అరుదైన సందర్భాలలో ఇదొకటి. వారు మాట్లాడుకుంటుండగా, పిలిచి ఈ ఫొటోను తీశారు’’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, టెస్లాకార్లను గూఢచర్యం కోసం ఉపయోగిస్తున్నారని చైనా మిలటరీ అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎలన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. టెస్లా కార్లతో గూఢచర్యానికి పాల్పడినట్లు రుజువైతే కంపెనీని మూసివేస్తానని ప్రకటించారు.
చదవండి : వైరల్: జాగ్రత్తపడకపోతే మనకు ఇదే గతి
Comments
Please login to add a commentAdd a comment