Samantha's Latest Photo Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Samantha: సమంత కొత్త ఫొటో.. గంటల్లో నెట్టింట వైరల్​

Published Mon, May 2 2022 8:40 PM | Last Updated on Tue, May 3 2022 10:54 AM

Samantha Latest Photo Goes Viral On Social Media - Sakshi

Samantha Latest Photo Goes Viral On Social Media: టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్ సమంత చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. సినిమాల పరంగానే కాకుండా సోషల్​ మీడియాలో కూడా ఫుల్​ యాక్టివ్​గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తన ఫిట్​నెస్ వీడియోలు, కొటేషన్స్​, ప్రమోషనల్ బ్రాండ్స్​ తదితర పోస్ట్​లు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా సామ్​ పెట్టిన పోస్ట్​ చూసి తన అభిమానులు మురిసిపోతున్నారు. 

'పెద్దదాన్ని, తెలివైనదాన్ని' అంటూ ఇన్​స్టాగ్రామ్​లో ఒక ఫొటో షేర్​ చేసింది. తెల్లటి పువ్వులు పట్టుకుని బ్యూటిఫుల్ స్మైల్​తో ఉన్న సామ్​ పోస్ట్​ అతి తక్కువ సమయంలోనే నెట్టింట వైరల్​ అయింది. కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల్లో కామెంట్స్​, లైక్స్​ వచ్చాయి. ఇదిలా ఉంటే ఇటీవల సమంత 35వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే అదే రోజు ఏప్రిల్​ 28న సామ్​ నటించిన 'కణ్మనీ రాంబో ఖతీజా' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

చదవండి: ఆ రెండింటికి దూరంగా ఉండాలనుకుంటున్నా : సమంత
ఎప్పటికీ కృతజ్ఞురాలినే,మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా : సమంత

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement