new post
-
సమంత కొత్త ఫొటో.. గంటల్లో నెట్టింట వైరల్
Samantha Latest Photo Goes Viral On Social Media: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తన ఫిట్నెస్ వీడియోలు, కొటేషన్స్, ప్రమోషనల్ బ్రాండ్స్ తదితర పోస్ట్‌లు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా సామ్ పెట్టిన పోస్ట్ చూసి తన అభిమానులు మురిసిపోతున్నారు. 'పెద్దదాన్ని, తెలివైనదాన్ని' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో షేర్ చేసింది. తెల్లటి పువ్వులు పట్టుకుని బ్యూటిఫుల్ స్మైల్‌తో ఉన్న సామ్ పోస్ట్ అతి తక్కువ సమయంలోనే నెట్టింట వైరల్ అయింది. కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల్లో కామెంట్స్, లైక్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ఇటీవల సమంత 35వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే అదే రోజు ఏప్రిల్ 28న సామ్ నటించిన 'కణ్మనీ రాంబో ఖతీజా' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: ఆ రెండింటికి దూరంగా ఉండాలనుకుంటున్నా : సమంత ఎప్పటికీ కృతజ్ఞురాలినే,మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా : సమంత View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
మెగాస్టార్ చిన్న కూతురు లేటెస్ట్ పోస్ట్.. ఏం చెబుతుందంటే !
Chiranjeevi Daughter Sreeja New Post About Her Childrens: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు, మెగా డాటర్ శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ తన మనసులోని భావాలను షేర్ చేసుకుంటుంది. ఇటీవల అన్నయ్య రామ్ చరణ్‌తో కలిసి దిగిన పిక్‌ను షేర్ చేస్తూ చిన్న విషయాలు కూడా నన్ను సంతోషపెడతాయంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. తాజాగా శ్రీజ తన పిల్లలతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ స్టోరీకి 'లవ్లీస్' అంటూ తన పిల్లలపై ఉన్న ప్రేమను చాటుకుంది శ్రీజ. అలాగే లవ్ సింబల్స్ పెట్టి తల్లిప్రేమను చాటింది. ఈ స్టోరీ చూస్తుంటే శ్రీజ తన పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీజకు నివ్రతీ, నవీక్ష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
నూతన పోలీసు కమిషనర్‌గా సందీప్ శాండిల్య
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ నూతన పోలీసు కమిషనర్‌గా సందీప్ శాండిల్య గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో శనివారం రాత్రి 7 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సందీప్ శాండిల్య మాట్లాడుతూ... శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఎఫెక్టివ్ పోలీసింగ్‌తో ప్రజలకు మరింత చేరువవుతామని తెలి పారు. నేరగాళ్లను వదలబోమని హెచ్చరించారు. శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లలో కేసులు, పాలనాపరమైన అంశాలపై పూర్తి దృష్టి సారిస్తానని తెలిపారు. -
ఉభయ రాష్ట్రాలకూ ఒకే ‘ఐటీ’ బాస్
కొత్త పోస్టును సృష్టించిన కేంద్ర ప్రభుత్వం విజయవాడకు కొత్తగా ఐటీ చీఫ్ కమిషనర్ పోస్టు సాక్షి, హైదరాబాద్: ఆదాయపన్ను శాఖ పునర్వ్య వస్థీకరణలో భాగంగా కేంద్రం పలు కొత్త పోస్టులను మంజూరు చేసింది. ఇందులోభాగంగా ఉభయ తెలుగురాష్ట్రాలకు కలిపి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్‌టాక్స్ పోస్టును హైదరాబాద్‌కు కేటాయించారు. ఇది కేంద్రప్రభుత్వ ప్ర త్యేక కార్యదర్శి హోదాకు సమానం. రెండు రాష్ట్రాల్లోని ఐటీశాఖ కేడర్‌ను ఈ పోస్టులో ఉండే అధికారే నియంత్రిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు కర్నూలులో, తెలంగాణకు హైదరాబాద్‌లో కొత్త గా అసెస్మెంట్ కమిషనర్ బాధ్యతలను చూసే పోస్టులను ఏర్పాటు చేశారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఏపీ కోసం విజయవాడలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్‌టాక్స్ పోస్టును సృష్టించారు. ఇప్పటికే విశాఖలో ఓ చీఫ్‌కమిషనర్ పోస్టు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కార్యాలయం పరిధిలోకే ఏపీలోని అన్నిప్రాంతాలు వస్తాయి. కాగా, అప్పీళ్లను పరిశీలించి వేగంగా పరిష్కరించడానికి వీలుగా 11 అప్పీలెట్ కమిషనర్ పోస్టులు కూడా మంజూరయ్యాయి. వీటిలో ఐదింటిని హైదరాబాద్‌కు కేటాయించారు. ఈ మార్పులన్నీ ఈ నెల 15 నుంచే అమల్లోకి వస్తాయని ఐటీ శాఖ సోమవారం ఓప్రకటన విడుదల చేసింది. మరి న్ని వివరాలనుశాఖ వెబ్సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్‌కమ్‌టాక్స్.ఓఆర్జీ)లో చూడవచ్చు.