
Chiranjeevi Daughter Sreeja New Post About Her Childrens: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు, మెగా డాటర్ శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ తన మనసులోని భావాలను షేర్ చేసుకుంటుంది. ఇటీవల అన్నయ్య రామ్ చరణ్‌తో కలిసి దిగిన పిక్‌ను షేర్ చేస్తూ చిన్న విషయాలు కూడా నన్ను సంతోషపెడతాయంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
తాజాగా శ్రీజ తన పిల్లలతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ స్టోరీకి 'లవ్లీస్' అంటూ తన పిల్లలపై ఉన్న ప్రేమను చాటుకుంది శ్రీజ. అలాగే లవ్ సింబల్స్ పెట్టి తల్లిప్రేమను చాటింది. ఈ స్టోరీ చూస్తుంటే శ్రీజ తన పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీజకు నివ్రతీ, నవీక్ష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment