‘ఉద్యోగ’ దీక్షబూని..
‘కొడితే కొట్టాలిరా.. సిక్స్ కొట్టాలి.. పడితే పట్టాలిరా.. కొలువు పట్టాలి’ అన్నట్టుగా ఉద్యోగ సాధన దీక్ష చేపట్టారు విజయనగరంలోని నిరుద్యోగులు. ప్రశాంత వాతావరణంలో తదేక దీక్షతో చదువుతూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. విజయనగరం కోటలోను, చుట్టుపక్కల గట్లు, చెట్ల కింద పదుల సంఖ్యలో నిరుద్యోగ యువత ఇలా చదువుతూ కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం
రైల్ బస్సు.. ప్రయాణం మిస్సు
ప్రకృతి అందాల నడుమ విశేష సేవలందించిన రైల్ బస్సు మూలనపడింది. బొబ్బిలి–సాలూరు మధ్య 21 కి.మీ. మేర ఒక ఇంజిన్, రెండు బోగీలతో నడిచే ఈ రైల్ బస్సును 1993లో ప్రారంభించారు. 15 గిరిజన గ్రామాల మధ్య ఇది నడిచేది. ఈ రైలు బస్సును నడపలేక రైల్వే అధికారులు మూలనపెట్టేశారు. ప్రస్తుతం ఇది విశాఖలోని రైల్వే స్విమ్మింగ్ పూల్ ప్రాంతంలో ఇలా ఉండిపోయింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం
ఇదేంటన్నా.. పోలీసన్నా
వాహన చోదకులు రహదారి నిబంధనలను అతిక్రమిస్తే.. అడ్డుకోవాల్సిన పోలీసులే నిబంధనల్ని అతిక్రమిస్తే ఏమనాలి. ఏమైనా అందామంటే.. వాళ్లు ఊరుకుంటారా. హెల్మెట్ ధరించకుండా మోటార్ సైకిల్‌పై నడపడమే కాకుండా.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ కొందరు పోలీసులు ఇలా ముందుకు సాగిపోతున్నారు. నిబంధనల్ని తోసిరాజని నెల్లూరు ఓ కానిస్టేబుల్ మాగుంట లేఅవుట్ ప్రాంతంలో కెమెరా కంటికి చిక్కారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
ఫిలిప్పీన్స్‌ను భీకర తుపాను క్రతోన్ వణికిస్తోంది. ఇలొకొస్ నార్టె ప్రావిన్స్‌లోని బకర్రాలో వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను తరలిస్తున్న సహాయక సిబ్బంది
క్రతోన్ తుపానుతో ఓ వైపు వర్షం కురుస్తుండగా ఆకాశంలో ఆహ్లాదం కలిగిస్తున్న ఇంద్రధనుస్సు. తైవాన్ రాజధాని తైపీలోనిదీ దృశ్యం.
గ్రీస్‌లో కార్చిచ్చు వ్యాపించింది. ఆదివారం కొరింతియా ప్రాంతంలోని అనో లౌట్రో గ్రామం వైపు దూసుకొస్తున్న మంటల దృశ్యమిది.
పితృ పక్షం సందర్భంగా సోమవారం బిహార్ రాష్ట్ర గయలోని దేవ్‌ఘాట్‌లో పిండ ప్రదానం చేస్తున్న ఓ విదేశీ భక్తురాలు
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో సోమవారం ‘మిస్ యూనివర్స్ కొరియా’ పోటీల్లో హొయలొలికిస్తున్న 81 ఏళ్ల చోయి సూన్ హ్వా.
Comments
Please login to add a commentAdd a comment