చిన్నారిని వీపుకి తగిలించుకుని నుడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక బాలుడు. అతన్ని చూసిన ఒక సైనికుడు ఆ చిన్నారిని కిందకి దించి వెళ్లిపో అన్నాడు. ఐతే ఆ బాలుడు చెప్పిన మాటలు ప్రపంచ గతిని మార్చే చక్కటి సందేశం ఇచ్చాడు. ఇంతకీ ఆ బాలుడెవరు ఏంటా కథ!
వివరాల్లోకెళ్తే... ఒక చిన్నారిని వీపుకి తగిలించుకుంటూ వెళ్తున్న బాలుడి చిత్రాన్ని డిసెంబర్ 30 2017న వాటికన్‌ప్రెస్ తర పత్రికలో ప్రచురించింది. ఇది నాగసాకిపై అణుదాడి తర్వాత జరిగిన పరిణామాల ఫోటోలలో ఒకటి ఇది. జపాన్ యుద్ధ సమయంలో దాదాపు 10 ఏళ్ల బాలుడు చనిపోయిన తన తమ్ముడిని ఖననం చేసేందుకు వీపుకి తగలించుకుని వెళ్తున్నాడు. అప్పుడూ అక్కడే ఉన్న ఒక సైనికుడు ఆ చిన్నారి చనిపోయాడు కాబట్టి ఇక్కడ వదిలి వెళ్లిపోమని సలహ ఇచ్చాడు.
ఆ బాలుడు ఆ చిన్నారిని మోసుకుని వెళ్లలేక నీరసించిపోతాడని అలా చెబుతాడు సైనికుడు. కానీ ఆ చిన్నారి తన తమ్ముడని, ఇది తనకు బరువు కాదని చెబుతాడు. పడిపోతే సాయం చేయండి, ఎత్తండి, తప్పు చేస్తే క్షమించండి అని ఏడుస్తూ చెబుతాడు. ఐనా ఆ చిన్నారి బరువుగా ఉండడు కాబట్టి మీ భుజాలపైకి తీసుకుని సాయం చేయండి అని అర్థిస్తాడు. ఆ బాలుడి మాటలకు సైనికుడి కళ్లలో నీళ్లుతిరుగతాయి.
అప్పటి నుంచి ఈ చిత్రం జపాన్‌లో ఐక్యతకు చిహ్నంగా మారింది. ఈ చిత్రాన్ని యూఎస్‌కి చెందిన మెరైన్ కార్ప్స్ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రోజర్ ఓడొనెల్ తన కెమారాలో బంధించారు. 1945లో హిరోషిమా, నాగసాకిపై అణు బాంబు దాడుల తర్వాత దృశ్యాలను డాక్యుమెంట్ చేసే బాధ్యతను ఓడొనెల్‌కు అప్పగించడంతో ఆయన ఈ చిత్రాన్ని తీశారు. ఆ ఫోటో వెనుక పోప్ ఫ్రాన్సిస్ 'ది ఫ్రూట్ ఆఫ్ వార్' అని రాసి సంతకం చేశారు. నాటి విషాధ ఘటన ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చిదనడంలో సందేహం లేదు.
(చదవండి: దాడులను తీవ్రతరం చేసిన రష్యా...బలవంతంగా ఉక్రెయిన్ పౌరుల తరలింపు)
Comments
Please login to add a commentAdd a comment