దుబాయ్‌లో నివశిసిస్తున్న భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీలసులచే ఘన సత్కారం లభించింది. ఈ విషయాన్ని దుబాయ్ పోలీసులు తమ అధికారిక ఖాతాలో వెల్లడించారు. దుబాయ్ పోలీస్ వెబ్‌సైట్ కథనం ప్రకారం..ముహమ్మద్ అయాన్ యూనిస్ తన తండ్రితో కలిసి ఒక పర్యాటక ప్రాంతంలో వెళ్తుండగా ఒక టూరిస్ట్ వాచ్‌ని దొరికింది. దానిని పోగొట్టుకున్న టూరిస్ట్‌కి అందేలా దుబాయ్ పోలీసులకు అప్పగించాడు. ఆ వాచ్‌ని అందుకున్న బాధితుడు దుబాయ్‌లో ఉన్నత స్థాయ భద్రత, సమగ్రత పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రశంసించాడు.
తాము ఆ వాచ్‌ని బాదితుడికి విజయవంతంగా అందించేలా సాయం చేసినందుకు గాను ఆ బాలుడిని దుబాయ పోలీసులు సత్కరించారు. అతడి నిజాయితీకి అవార్డును అందించి, సర్టిఫికేట్‌ను ప్రదానం చేశారు అధికారులు. పర్యాటకులు పోగొట్టుకున్న వాచ్‌ని నిజాయితీగా ఇచ్చినందుకు గానూ ఆ బాలుడు దుబాయ్ పోలీసుల చేత ఈ గౌరవాన్ని అందుకున్నాడు. ఈ మేరకు టూరిస్ట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఖాల్ఫాన్ ఒబీద్ అల్ జల్లాఫ్, అతని డిప్యూటీ లెఫ్టినెంట్ కల్నల్ ముహ్మద్ అబ్దుల రెహ్మాన్, టూరిస్ట్ హ్యీపీనెస్ విభాగం అధిపతి కెప్టెన్ షహబ్ అల్ సాదీ తదితరులు బాలుకుడికి ఈ సర్టిఫికేట్‌లను అందజేశారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్‌లో తెలుపుతూ అందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేసింది. ఇది యూఏఈలో పిల్లల ప్రవర్తన, ఉన్నతమైన నైతిక ప్రమాణాలు, భద్రతను ప్రతిబింబిస్తుందని, ముఖ్యంగా దాని కీలకమైన పర్యాటక రంగంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుందని జల్లాఫ్ అన్నారు. అందరూ యూనిస్ అడుగుజాడల్లో నడవాలని అన్నారు. అలానే గతనెలలో జుమేరా బీచ్‌లో దొరికిన విలువైన వస్తువుని అప్పగించినందుకు ఒక యువకుడిని దుబాయ్ పోలీసులు సత్కరించడం జరిగింది.
#News | Dubai Police Honours Child for Honesty After Returning Tourist's Lost Watch
Details:https://t.co/6dFnBky55r#YourSecurityOurHappiness#SmartSecureTogether pic.twitter.com/bVccqxabP5— Dubai Policeشرطة دبي (@DubaiPoliceHQ) May 12, 2024
(చదవండి: భారత న్యూయార్క్ కాన్సులేట్ ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది!)
Comments
Please login to add a commentAdd a comment