అప్పటి పిల్లాడే.. నేడు ప్రపంచ కుబేరుడు - ఎవరో చెప్పుకోండి | Guess The Person He is the Richest Man in The World | Sakshi
Sakshi News home page

అప్పటి పిల్లాడే.. నేడు ప్రపంచ కుబేరుడు - ఎవరో చెప్పుకోండి

Published Sat, Jun 29 2024 6:35 PM | Last Updated on Sat, Jun 29 2024 7:51 PM

Guess The Person He is the Richest Man in The World

ఈ ఫొటోలో కనిపిస్తున్న పాలబుగ్గల పాపాయి ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఇతడే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఇప్పటికే మీ మనసులో ఓ పేరు తళుక్కుమని మెరిసి ఉంటుంది. మీరు ఊహించింది నిజమే.. ఇతడే టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్'.

ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన 'ఇలాన్ మస్క్' గురించి అందరికి తెలుసు. జూన్ 28 నాటికి 53ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మస్క్ తన 30వ ఏట తీయించుకున్న ఫోటో కూడా షేర్ చేశారు.

మస్క్ సంపద సుమారు రూ. 20 లక్షల కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తుంది. ఇటీవల ఈయన తన మూడో భార్య ద్వారా మరో బిడ్డను పొందారు. దీంతో ఈయనకు మొత్తం 12 మంది సంతానం ఉన్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement