సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ పరిధిలోని పద్మావతి కాలనీలో చైన్ స్నాచింగ్ జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. ఈ ఘటనలో మహిళ మెడకు స్వల్ప గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు గూడురి వెంకట్ రెడ్డి ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment