
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి
రాంగోపాల్‌పేట్: నడుచుకుంటూ వెళ్తున్న వారి నుంచి మొబైల్ ఫోన్లు లాక్కుని వెళుతున్న ఇద్దరు మైనర్లతో పాటు మరో వ్యక్తిని రాంగోపాల్‌పేట్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ బాబుతో కలిసి వివరాలు వెల్లడించారు. నల్లగుట్టకు చెందిన ప్రభాకర్, అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లతో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. ముగ్గురూ కలిసి రోడ్డుపై నడిచి వెళుతున్న వారి నుంచి సెల్‌ఫోన్లు లాక్కెళ్లేవారు. ఆదివారం అర్ధరాత్రి శైలేందర్‌కుమార్ శుక్లా అనే వ్యక్తి ఎంజీరోడ్డులో నడుచుకుంటూ వస్తుండగా ఆల్ కరీం ట్రేడ్ సెంటర్ సమీపంలో వెనునక నుంచి బైక్‌పై వచ్చిన నిందితులు అతడి చేతిలో ఉన్న సెల్‌ఫోన్ లాక్కుని ట్యాంక్‌బండ్ వైపు పరారయ్యారు. సోమవారం ఉదయం శుక్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు నల్లగుట్టకు చెందిన వారిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరం అంగీకరించారు. మైనర్లను జువైనల్ హోంకు, నిందితుడి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment