మొయినాబాద్ మండలం శ్రీరాంనగర్‌లో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన సామ చంద్రకళ(60) సోమవారం సాయంత్రం ఒంటరిగా నడిచి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఆగంతకులు ఆమెను ఓ ఇంటి అడ్రస్ అడిగారు.
మొయినాబాద్ (రంగారెడ్డి) : మొయినాబాద్ మండలం శ్రీరాంనగర్‌లో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన సామ చంద్రకళ(60) సోమవారం సాయంత్రం ఒంటరిగా నడిచి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఆగంతకులు ఆమెను ఓ ఇంటి అడ్రస్ అడిగారు. ఆమె చెప్పబోతుండగానే ఒకరు మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును తెంచేశారు. బాధితురాలు కేకలు వేస్తుండగానే దుండగులు రెప్పపాటులో ఉడాయించారు. ఈ మేరకు చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.