
మేడ్చల్ జిల్లా:
చైన్ స్నాచింగ్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడాలో కొన్ని రోజుల క్రితం ఓ మహిళ తలపై సుత్తితో మోది చైన్ స్నాచింగ్కు పాల్పడిన నిందితుడు మహేందర్‌ను జవహర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా నేరం తానే చేసినట్లు ఒప్పుకున్నాడు.
కాగా, పోలీసుల విచారణలో కొత్త విషయం బయటపడింది. గాయపడిన యువతికి, మహేందర్‌కు మధ్య కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుందని వెల్లడైంది. మహేందర్ తన ఇంట్లోకి రావడం పక్కింటి వారు చూడడంతో ఈ విషయం తన భర్తకు ఎక్కడ తెలిసిపోతుందేమోనని భయంతో చైన్ స్నాచింగ్ నాటకం ఆడినట్లు తెలిసింది.