చైతన్యపురిలో చైన్‌స్నాచింగ్
Published Thu, Sep 22 2016 2:25 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోహన్ నగర్ లో చైన్ స్నాచింగ్ జరిగింది. స్థానికంగా ఉన్న సాయికృప అపార్ట్‌మెంట్ సమీపంలో నివాసముంటున్న లక్ష్మి అనే మహిళ మెడలోని 5 తులాల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement