పూలు కోస్తుండగా పుస్తెలతాడు చోరీ | Chain Snatching in Rajendrangar | Sakshi
Sakshi News home page

పూలు కోస్తుండగా పుస్తెలతాడు చోరీ

Published Tue, Dec 25 2018 8:41 AM | Last Updated on Tue, Dec 25 2018 8:41 AM

Chain Snatching in Rajendrangar - Sakshi

బాధితురాలు అనసూయ

రాజేంద్రనగర్‌: దేవుడి పూజ కోసం ఇంటి పక్కన ఉన్న చెట్ల నుంచి పూలు కోస్తున్న ఓ గృహిణి మెడలోని ఐదున్నర తులాల బంగారు గొలుసును బైక్‌పై వెనుక నుంచి వచ్చిన యువకుడు తెంపుకెళ్లాడు. విషయాన్ని గమనించి స్థానికుడు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హుడాకాలనీ శివాజీనగర్‌ ప్రాంతానికి చెందిన అనసూయ(56), నర్సింహ భార్యాభర్తలు. నర్సింహ పోలీస్‌ శాఖలో పని చేసి రిటైర్డ్‌ అయ్యాడు. అనసూయ రోజూ మా దిరిగానే సోమవారం ఉదయం పూజ చేసేందుకు గాను బయట ఉన్న మొక్కల నుంచి పూలు కోసేందుకు బయటకు వచ్చింది. పూలు కోస్తున్న సమయంలో స్కూటీపై హెల్మెట్‌ ధరించిన యువకుడు అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతడిని అనసూ య అంతగా పట్టించుకోలేదు. ఆ యువకుడు వెను క నుంచి హఠాత్తు వచ్చి ఆమె మెడలోని పుస్తెలతాడును పట్టుకొని వాహ నంపై ముందుకు దూసుకువెళ్లాడు.

అప్రమత్తమైన అనసూయ బం గారు గొలుసును పట్టుకొని దొంగా దొంగా అ ంటూ అరుపులు పెడుతూ ముం దుకు వెళ్లింది. చైన్‌స్నాచర్‌ ఒక్కసారిగా బలంగా లాగి పుస్తెలతాడును తెంచుకొని పరారయ్యాడు. ఈ విషయాన్ని గ్రహించిన పక్కనే ఉండే జీవన్‌ అనే వ్యక్తి చైన్‌స్నాచ ర్‌ వాహనానికి అడ్డు వచ్చి పట్టుకునేందుకు ప్ర య త్నించాడు. ఈ సమయం లో చైన్‌స్నాచర్‌ కిందపడ్డాడు. పక్కనే ఉన్న కర్ర దుంగను తీసుకొని చైన్‌ స్నాచర్‌ జీవన్‌పై దాడిచేసి వెంటనే వాహనంపై ప్రధాన రహదారి మీదుగా పరారయ్యాడు. పక్కనే ఉన్న మరో ఇద్దరు ముగ్గురు యువకులు ఈ సమయంలో చైన్‌స్నాచర్‌ను ప్రతిఘటిస్తే చిక్కేవాడు. కానీ ఏ ఒక్కరు ము ందుకు రాలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్, రాజేంద్రనగర్‌ డివిజన్‌ ఏసీపీ అశోక చక్రవర్తి పరిశీలించారు. బాధితురాలి ని వివరాలు అడి గి తెలుసుకున్నారు. ఘటనా స మయంలో చైన్‌స్నాచర్‌ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు సీసీ కెమెరాలో నిక్షిప్తమైందని, ఆ సమయ ంలో ఫో న్‌ డేటాను సేకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలో నిందితుడిని అరెస్తు చేస్తామని ఏసీపీ వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement