హైదరాబాద్: రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్‌లో బుధవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సంగీత అనే మహిళ ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో బైక్ పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు పరిసరాలలోని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.