నగరంలో పట్టపగలే మరోసారి చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు.
హైదరాబాద్: నగరంలో పట్టపగలే మరోసారి చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఎల్బీనగర్లోని శాతవాహననగర్లో బుధవారం మధ్యాహ్నం వరలక్ష్మి అనే మహిళ మెడలోంచి 3 తులాల మంగళ సూత్రాన్ని లాక్కెళ్లారు. రోడ్డుపై నడిచి వెళ్తుండగా.. బైక్పై ఎదురుగా వచ్చిన దుండగులు ఒక్కసారిగా మంగళ సూత్రాన్ని లాక్కొని పరారయ్యారు. ఈ విషయమై బాధిత మహిళ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.