పూజలు చేస్తానని గృహిణిని నమ్మించి.. | A Priest Cheated Women At LB Nagar Hyderabad | Sakshi
Sakshi News home page

Jun 6 2018 9:30 AM | Updated on Sep 4 2018 5:48 PM

A Priest Cheated Women At LB Nagar Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నాగోలు : కుమారుడి ఆరోగ్యం బాగుపడేందుకు పూజలు చేస్తానని గృహిణిని నమ్మించి ఓ మహిళ రూ.95 వేలు విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మన్సూరాబాద్‌ వినాయక్‌నగర్‌లో ఉంటున్న దోమల జ్యోతి, యాదగిరి దంపతులకు కుమారుడు ఉన్నాడు. అతను గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

మంగళవారం జ్యోతి కుమారుడితో సహా ఇంటి ముందు నిలుచుకుని ఉండగా అక్కడికి వచ్చిన గుర్తు తెలియని మహిళ ఆమెతో మా టలు కలిపింది. బాబు ఆరోగ్యం మెరుగు పడేందుకు పూజలు చేస్తానని చెప్పింది. తాను పూజలు చేసేంత వరకు బంగారు ఆ భరణాలను ఓ డబ్బాలో ఉంచాలని సూచించింది. దీంతో జ్యోతి తన మంగళసూత్రంతో పాటు బంగారు ఆభరణాలను బాక్సులో పె ట్టింది. అనంతరం ఆమె జ్యోతి దృష్టిని మళ్లించి బాక్సుతో సహా పరారైంది.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement