
మహిళను వెంబడిస్తున్న దొంగ (సీసీటీవీ చిత్రం)
సాక్షి, పలాస/శ్రీకాకుళం: జిల్లాలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలోని గోల్డ్ చైన్‌ను బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు. వివరాలు.. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని రోటరీనగర్‌కు చెందిన ఉషారాణి శుక్రవారం సాయత్రం తమ ఇంటివైపు నడుచుకుంటు వెళ్తుండగా వెనకే వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని బైక్‌పై పరారయ్యారు. దొంగతనం అడ్డుకునే క్రమంలో ఉషారాణికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఓ సీసీటీవీలో నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్నామనీ, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment