* పాల్వంచలో సీసీ కెమెరాల ఏర్పాటు
* వారం రోజుల్లో ప్రారంభించనున్న ఎస్పీ
పాల్వంచ : రోజురోజుకు పెరుగుతున్న దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, రోడ్డు ప్రమాదాలు. వీటిని నియంత్రించడంతోపాటు సకాలంలో సమస్యలను పరిష్కరించేందుకు.. అసాంఘిక శక్తులకు అడ్డుక ట్ట వేసేందుకు పోలీసులు పూనుకున్నారు. పట్టణంలోని 26 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్య, ఘర్షణలు, అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పటి కే జిల్లాలోని ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లి పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా.. పాల్వంచలో ఈ తరహాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
పది సెంటర్లలో...
పట్టణంలోని బస్టాండ్, దమ్మపేట సెంటర్, అంబేద్కర్ సెంటర్, నటరాజ్ సెంటర్, అల్లూరి సెంటర్, కేటీపీఎస్ సెంటర్, మార్కెట్ ఏరియా, శాస్త్రి రోడ్ తదితర 10 సెంటర్లలో 26 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్థానిక వ్యాపారుల సహకారంతో పోలీసులు రూ.6లక్షలతో హెడీ 4 మెగా ఫిక్స ల్ స్థాయి సీసీ కెమెరాలు అమర్చారు. కెమెరాల పనితీరును టౌన్ పోలీస్‌స్టేషన్‌లో టీవీ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశారు. గొడవలు, దొంగతనాలు, అక్రమ రవాణా, అనుమానాస్పద వ్యక్తుల సంచారం వంటి వాటిని వెనువెంటనే క్షుణ్ణంగా పరిశీలించి.. చెక్ పెట్టనున్నారు.
వారికి చెక్ పెట్టేందుకే..
అసాంఘిక శక్తులకు చెక్ పెట్టేందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. సంఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే.. కారకులను పట్టుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. వారం రోజుల్లో జిల్లా ఎస్పీ చేత వీటిని ప్రారంభిస్తాం.
- ఎంఏ.షుకూర్, సీఐ, పాల్వంచ
10 సెంటర్లు.. 26 కెమెరాలు!
Published Wed, Apr 20 2016 2:57 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement