కళ్లలో కారం కొట్టి చైన్ స్నాచింగ్
Published Fri, Oct 28 2016 12:59 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
- నిందితులను పట్టుకున్న స్థానికులు
మేడ్చల్: ఓ మహిళ కళ్లలో కారం కొట్టి చైన్ స్నాచింగ్ పాల్పడిన ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్‌లో చోటు చేసుకుంది. ఓ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండటం చూసిన దుండగులు కళ్లలో కారం కొట్టి 3 తులాల బంగారు గొలుసుతో నాగరాజు, మహేష్ అనే ఇద్దరు యువకులు పరారయ్యాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement