వేములవాడ అర్బన్ (కరీంనగర్ జిల్లా) : వేములవాడలో ఓ ఆగంతకుడు మహిళ మెడలో పుస్తెలతాడును తెంపుకుపోయాడు. శనివారం మధ్యాహ్నం శ్యామల అనే మహిళ బుద్ధి పోచమ్మ వీధిలోని తన నివాసం నుంచి శివసాయినగర్‌లోని కుమార్తె నివాసానికి వెళ్లేందుకు బయల్దేరింది. నడుచుకుంటూ వెళ్తుండగా మార్గమధ్యంలో ఓ ఆగంతకుడు బైక్‌పై వచ్చి ఆమెను అటకాయించి రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును తెంపుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.