హైదరాబాద్ : కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నింబోలిఅడ్డాలో మంగళవారం చైన్ స్నాచింగ్ జరిగింది. డిఎస్‌ఐ బి.జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. నింబోలిఅడ్డా ప్రాంతానికి చెందిన రేపాల లలిత(50) స్థానికంగా ఉన్న మహంకాళి దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా లాల్‌బహదూర్ స్కూల్ సమీపంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి లలిత మెడలోని 4తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. లలిత ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.