దంపతులను చాకుతో బెదిరించి బంగారు చైన్లు లాక్కెళ్లిన సంఘటన జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్ పరిదిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
బెంగళూరు (బనశంకరి) : దంపతులను చాకుతో బెదిరించి బంగారు చైన్లు లాక్కెళ్లిన సంఘటన జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్ పరిదిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... నాగరబావిలోని వినాయక లేఔట్‌కు చెందిన రవి, భార్య ఆశా దంపతులు సోమవారం రాత్రి బంధవులు వివాహ రిసెప్షన్‌కు హాజరై అర్ధరాత్రి బైక్‌లో ఇంటికి బయలుదేరారు.
ఇంటి వద్ద వాహనం దిగుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దురు దుండగులు దంపతులను బెదిరించి ఆశ మెడలో ఉన్న 50 గ్రాముల బంగారు చైన్ లాక్కొని ఉడాయించారు. బాధితులు ఇక్కడి జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.