వీరఘట్టం(శ్రీకాకుళం జిల్లా): వీరఘట్టంలోని ఓ హోటల్ వద్ద చైన్ స్నాచింగ్ జరిగింది. హోటల్ వద్ద పనిచేసుకుంటున్న జి. శ్రీదేవి అనే మహిళ మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.