హైదరాబాద్‌లో అనూహ్య ఘటన | Chain Snatching at Saroor Nagar | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అనూహ్య ఘటన

Published Mon, Oct 16 2017 6:35 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Chain Snatching at Saroor Nagar - Sakshi

హైదరాబాద్‌: చైన్‌ స్నాచర్లు కొత్తకొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. ఇప్పటివరకు బైక్‌పై తిరుగుతూ రోడ్డున వెళ్తున్న మహిళల మెడల్లోంచి బంగారపు గొలుసులు లాక్కెళ్లేవారు. ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకి వచ్చి గొలుసులు లాక్కెళ్తున్నారు. ఇలాంటి సంఘటనే సరూర్‌నగర్‌ పోస్టాఫీసు సమీపంలో సోమవారం జరిగింది. మమత అనే మహిళ ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో హెల్మెట్‌ ధరించి వచ్చిన ఓ వ్యక్తి తలుపు తట్టాడు. తలుపు తీస్తుండగానే ఆ వ్యక్తి ఆమె ముఖంపై స్ప్రే కొట్టి మెడలోని నాలుగు తులాల పుస్తెల తాడు లాక్కెళ్లాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు దొంగను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement