వరంగల్ రూరల్ : పాపం ఓ దొంగ ఈ రోజు ప్రొద్దున్నేలేచి ఎవరి ముఖం చూశాడో గానీ బంగారం దొంగిలిద్దామని బయలుదేరితే చేతికి రోల్డ్ గోల్డ్ చైన్ దొరికింది. చివరికి మహిళ మెడలోని రోల్డ్ గోల్డ్ చైన్ దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన వరంగల్ హంటర్ రోడ్డులో మినీ రైల్వే బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న దారబోయిన శారద అనే మహిళ ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. శారద తన తల్లితో కలిసి రోడ్డుపై వెళ్తుండగా లక్ష్మణ్ అనే వ్యక్తి ఆమె మెడలోని పుస్తెలతాడు లాక్కొని పరారయ్యాడు.
వెంటనే కేకలు వేయడంతో చుట్టప్రక్కల వారు స్పందించి దొంగను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అతను దొంగిలించిన గొలుసును స్వాధీనం చేసుకున్నారు. తీరా దొంగిలించిన గొలుసు రోల్డ్‌గోల్డ్‌ది కావడంతో ఆశ్చర్యపోవడం పోలీసులు, దొంగ వంతయింది. లక్ష్మణ్ ఓ సైకో అని చుట్టుప్రక్కల వారు చెబుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చావని పోలీసులు ప్రశ్నించగా..తనది నెల్లికుదురు మండలం అని మాత్రమే చెబుతున్నారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment