శ్రీరామనవమి సందర్భంగా ఇంటికి తాళాలు వేసి గుడికి వెళ్లడంతో దొంగలు తమ చేతివాటం చూపించారు.
సరూర్‌నగర్ : శ్రీరామనవమి సందర్భంగా ఇంటికి తాళాలు వేసి గుడికి వెళ్లడంతో దొంగలు తమ చేతివాటం చూపించారు. హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు కర్మన్‌ఘాట్‌లోని సాయిబాలాజీ హోమ్స్‌లో చొరబడి రెండు ఫ్లాట్లలో దోపిడీకి పాల్పడ్డారు. ఈ చోరీలో సుమారు 57 తులాల బంగారు ఆభరణాలు, కొన్ని వెండి ఆభరణాలతో పాటు నగదును దొంగిలించారు. సీతారామ కల్యాణం అనంతరం ఇళ్లకు తిరిగి వచ్చిన యజమానులు చోరీ విషయం గమనించి లబోదిబోమన్నారు.
కాగా విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.