ఉద్యోగమంటూ పిలుస్తాడు... మత్తిచ్చి దోచేస్తాడు! | Cyber Crime Thief Arrest In Hyderabad | Sakshi
Sakshi News home page

ఉద్యోగమంటూ పిలుస్తాడు... మత్తిచ్చి దోచేస్తాడు!

Published Fri, Jul 20 2018 9:35 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

Cyber Crime Thief Arrest In Hyderabad - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీపీ మహేష్‌ భగవత్, చిత్రంలో నిందితుడు

నాగోల్‌: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో క్లాసిఫైడ్స్‌లో ప్రకటనలు ఇస్తాడు... ఆకర్షితులై సంప్రదించిన వారిలో ప్రధానంగా మహిళలు/యువతుల్నిలను టార్గెట్‌గా చేసుకుంటాడు... వీసా ప్రాసెసింగ్‌ ఇంటర్వ్యూ పేరుతో ఉత్తరాదికి రప్పిస్తాడు... బ్యాంకు ఖాతా వివరాలు, కార్డులు తీసుకురమ్మంటాడు... అలా వచ్చిన వారికి మత్తు మందు ఇచ్చి ఖాతాలు ఖాళీ చేయడంతో పాటు ఒంటి మీద ఉన్న నగలూ ఒలుచుకుపోతాడు... ఈ పంథాలో దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న లుథియానా వాసి తల్వీందర్‌ సింగ్‌ను రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.16.84 లక్షల నగదు, 15 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ గురువారం వెల్లడించారు. 2012 తర్వాత ఇతను చిక్కడం ఇప్పుడేనని ఆయన పేర్కొన్నారు. 

జర్మనీలో ఉద్యోగమంటూ....
తల్వీందర్‌ సింగ్‌కు మరో ఐదు మారుపేర్లూ ఉన్నాయి. అమెరికాలోని  పెర్ఫ్యూమ్‌ ఫ్రాంచియర్‌ సంస్థ జర్మనీలో ఓ బ్రాంచ్‌ తెరుస్తోందని, అక్కడ పని చేయడానికి రిసెప్షనిస్ట్, కుక్, డ్రైవర్లు కావాలంటూ గత జనవరిలో తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడు. వీటిని చూసిన ఎన్టీఆర్‌ నగర్‌ వాసి గుర్రం హరిత, మహబూబ్‌నగర్‌ జిల్లా, భూత్పూర్‌కు చెందిన మోరెడ్డి విద్యాసాగర్‌ అందులో పేర్కొన్న నంబర్లను సంప్రదించారు. హరిత నుంచి పూర్తి వివరాలు కనుక్కున్న తల్వీందర్‌ ఇంటర్వ్యూ కోసం ఢిల్లీ రమ్మని చెప్పాడు. వీసా ప్రాసెసింగ్‌ జరగాలంటే బ్యాంకు ఖాతాలో భారీ మొత్తం ఉండాలన్నాడు. ఎక్కువ పోస్టులు లేని కారణంగా వీలైనంత త్వరగా రమ్మని చెప్పడంతో హరిత తన తల్లితో కలిసి ఢిల్లీ వెళ్లింది. విమానాశ్రయంలో వీరిని రిసీవ్‌ చేసుకున్న తల్వీందర్‌ హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైల్వే స్టేషన్‌కు తీసుకువెళ్ళాడు. 

ఆహారంతో మత్తుమందు కలిపి...
అప్పటికే మధ్యాహ్నం కావడంతో భోజనం చేదా ్దమని చెప్పాడు. అదును చూసుకుని ఆహారంలో నిద్రమాత్రలు కలిపి వారితో తినిపించాడు. వీటి ప్రభావంతో మగతగా ఉన్న తల్లీకూతుళ్లను రైలు లో ఝాన్సీ ప్రాంతానికి తీసుకువెళ్లి ఓ లాడ్జిలో ఉంచాడు. అనంతరం భద్రత కారణాల పేరుతో వారి ఒంటిపై ఉన్న 15 తులాల బం గారం తీ యించి దాచాడు. ఆపై వారిని బ్యాంక్‌కు తీసుకెళ్లి వారి ఖాతాల్లో ఉన్న రూ.19 లక్షలను తన ఖాతా ల్లోకి మళ్లించాడు. మత్తు దిగిన తర్వాత తేరుకున్న వీరు తమ బంగారం ఇవ్వమని కోరగా ఉడాయిం చాడు. బ్యాంకు ఖాతాలు తనిఖీ చేసుకో గా ఖాళీ అయినట్లు గుర్తించారు. అదే సమయం లో వీరికి తార సపడిన మోరెడ్డి విద్యాసాగర్, భా ర్య రాధ తా మూ మోసపోయినట్లు తెలిపారు. ఇద ్దరూ అక్కడి పోలీసులను ఆశ్రయించినా సరైన స్పం దన లేకపోవడంతో హరిత సిటీకి తిరిగి వచ్చి రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

హిమాచల్‌ప్రదేశ్‌లో అరెస్ట్‌...
వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, ఝాన్సీ తదితర ప్రాంతాలకు వెళ్లి కీలక ఆధారాలు సేకరించారు. ఇదే పంథాలో రాజస్థాన్‌లోని బికనీర్‌లో మరో నేరం జరిగినట్లు తెలుసుకుని, తాము సేకరించిన సమాచారాన్ని అక్కడి పోలీసులకు అందించారు. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన బికనీర్‌ పోలీసులు గత నెల 17న హిమాచల్‌ప్రదేశ్‌లోని కున ప్రాంతంలో తల్వీందర్‌ను పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాచకొండ పోలీసులు బికనీర్‌ వెళ్లి పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి తీసుకువచ్చారు. నిం దితుడి నుంచి రూ.16.84 లక్షల నగదు, 15 తు లాల బంగారం రికవరీ చేశారు. రూ.80 వేలు కోల్పో యిన విద్యాసాగర్‌ ఫిర్యాదుతో ఝాన్సీలో కేసు నమోదైందని, ఈ కేసులో అతడితో పాటు రాధను సాక్షులుగా పరిగణిస్తున్నామని, తల్వీంద ర్‌ ఇదే పంథాలో హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజ స్థాన్‌ల్లోనూ నేరాలు చేశాడని సీపీ వెల్లడించారు.  

మాటలే పెట్టుబడి..
‘మాటల మాయగాడు’ తల్వీందర్‌ సింగ్‌ చదివింది కేవలం 12వ తరగతి.  క్లాసిఫైడ్స్‌ ప్రకటనలతో ఎర వేసి మత్తు మందిచ్చి దోచుకునే ఇతగాడూ ఒకప్పుడు బాధితుడే. ఆపై మోసగాడిగా మారడంతో తండ్రి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. ప్రస్తుతం మారు పేర్లతో బతుకున్న తల్వీందర్‌ వేషధారణ, ఆంగ్లపై పట్టు చూసి ఎవరైనా బుట్టలో పడాల్సిందేనని అంటున్నారు. 

బాధితుడి నుంచి నిందితుడిగా...
తల్వీందర్‌ తండ్రి దుబాయ్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతనూ అక్కడికి వెళ్లి ఆరేళ్ల పాటు ట్రక్‌ డ్రైవర్‌గా పని చేశాడు. 2012లో విదేశాల్లో ఉద్యోగాల పేరుతో వచ్చిన ప్రకటన చూసిన తల్వీందర్‌ వారిని సంప్రదించగా సదరు ముఠా ఇతడి నుంచి రూ.2.5 లక్షలు కాజేసింది. దీంతో మోసాల బాటపట్టిన తల్వీందర్‌ అదే ఏడాది తొలి మోసం చేసి జలంధర్‌ పోలీసులకు చిక్కాడు. దీంతో ఇంట్లోనుంచి తరిమేయడంతో లుథియానాకు మకాం మార్చాడు. 

మరో ‘గుర్తింపు’ సృష్టించుకుని...
తన పేరును అమన్‌ వీత్‌ పాల్‌ సిధుగా మార్చుకున్న అతను ఇదే పేరుతో ఆధార్, పాన్‌కార్డులతో పాటు పాస్‌పోర్ట్‌ కూడా పొందాడు. విదేశీ ఉద్యోగాల పేరుతో ఎర వేసే ఇతను వారి నుంచి బంగారం, నగదు తీసుకుని ఉడాయించేవాడు. వీసా ప్రాసెసింగ్‌ కావాలంటే ఖాతాలో భారీ మొత్తంతో పాటు తాజా లావాదేవీలు ఉండాలని చెప్పే వాడు. వారితోనే బ్యాంకు ఖాతాలోని డబ్బులు డ్రా చేయించి, దాస్తానంటూ తీసుకునే వాడు. ఆపై మత్తు మందు ఇచ్చి వాటితో ఉడాయించేవాడు. 

మారు వేషంతో నగదు డ్రా...
కొన్ని సందర్భాల్లో తల్వీందర్‌ మత్తులో ఉన్న బాధితులను ఏటీఎం కేంద్రాలు, బ్యాంకులకు తీసుకువెళ్ళి డబ్బు డ్రా చేయిస్తాడు. వారి కార్డులతో బంగారం దుకాణాల్లో షాపింగ్స్‌ సైతం చేసేవాడు. ఈ సందర్భంలో సీసీ కెమెరాల్లో తన ఆనవాళ్లు రికార్డు కాకుండా వేషం మార్చేవాడు. ఇలా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తూ రోజుల కు రూ.30 వేల వరకు ఖర్చు చేస్తుంటాడు. ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన హరిత వివాహం కోసం వారి కుటుంబీకులు దాచిన సొమ్మును స్వాహా చేశాడు. కేసు దర్యాప్తు చేసిన ఏసీపీ ఎస్‌.హరినాథ్, ఇన్‌స్పెక్టర్‌ జె.నరేందర్‌గౌడ్‌ తదితరులను సీపీ అభినందిస్తూ రివార్డులు అందజేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement