దేశం మొత్తం ప్రధాని చెప్పిన బేటీ బచావో బేటి పడావో నినాదాన్ని ఆదర్శంగా తీసుకుంటూ... అమ్మాయిల నిష్పత్తి తగ్గిపోతోందని బాధ పడుతోంటే..
సరూర్‌నగర్: దేశం మొత్తం ప్రధాని చెప్పిన బేటీ బచావో బేటి పడావో నినాదాన్ని ఆదర్శంగా తీసుకుంటూ... అమ్మాయిల నిష్పత్తి తగ్గిపోతోందని మొత్తుకుంటుంటే.. మూడోసారి కూడా ఆడపిల్లే పుట్టిందని భార్యను వదిలి మరో పెళ్లి చేసుకున్నాడో ప్రబుద్ధుడు.
వంశోద్ధారకుడు కావాలని గురువారం నగరంలోని సరూర్ నగర్‌కు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్ఉద్యోగి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇతనికి ఇదివరకే పెళ్లైంది. ముగ్గురు కూతుర్లు ఉన్నారు. దీంతో అబ్బాయిలు కలగాలని మొదటి భార్యను కాదని మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని సరూర్ నగర్ పోలీసుస్టేషన్‌లో మొదటి భార్య ఫిర్యాదు చేసింది.