![Saroornagar Student Attempt Suicide Due To Raging Harassment - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/8/suicide_0.jpg.webp?itok=elMHZR_j)
సాక్షి, హైదరాబాద్: ర్యాగింగ్ వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సరూర్‌నగర్‌లో కలకలం రెపింది. తోటి విద్యార్థులే ర్యాగింగ్ చేయడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలు కర్మాన్‌ఘాట్‌లోని నియోరాయల్ స్కూల్‌లో పదో తరగతి చదువుకుంటోంది. తోటి విద్యార్థులే రూ. 10వేలు తీసుకురావాలంటూ రోజు వేధించేవారని, స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని బాలిక ఆరోపించింది. దీంతో వేధింపులు కూడా ఎక్కువ కావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించానని బాలిక పేర్కొంది. దీంతో బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment