Congress Yuva Sangharshana Sabha Priyanka Gandhi Tour Live Updates - Sakshi
Sakshi News home page

Yuva Sangharshana Sabha: ‘తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం అంత ఈజీగా చేసింది కాదు’

Published Mon, May 8 2023 4:44 PM | Last Updated on Mon, May 8 2023 6:50 PM

Congress Yuva Sangharshana Sabha Priyanka Gandhi Tour Live Updates - Sakshi

Updates..

► సరూర్‌నగర్‌ నుంచి రోడ్డుమార్గంలో ప్రియాంక గాంధీ బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. 

► ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ మీకు నేల కాదు.. తల్లిలాంటిది. నీరు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ కోసం ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారు. మా కుటుంబం కూడా దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఆ బాధ ఏంటో మాకు తెలుసు. బలిదానాలు వృథా కాకూడదని ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి. తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం అంత ఈజీగా చేసింది కాదు. 

► బలిదానాలు వృథా కాకూడదని ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి 9ఏళ్లు అవుతోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇప్పటి వరకు నెరవేరలేదు. కేసీఆర్‌ తెలంగాణను తన జాగీరు అనుకుంటున్నారు. రుణమాఫీ చేస్తామన్న హామీ ఇంకా నెరవేరలేదు. 

► తెలంగాణలో అధికారం కోసం రాష్ట్రం ఇవ్వలేదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి 9ఏళ్లు అవుతోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇప్పటి వరకు నెరవేరలేదు. కేసీఆర్‌ తెలంగాణను తన జాగీరు అనుకుంటున్నారు. రుణమాఫీ చేస్తామన్న హామీ ఇంకా నెరవేరలేదు. 

► 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క యూనివర్సిటీని కొత్తగా ఏర్పాటు చేయలేదు. మీ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయో ఆలోచించండి. నిరుదోగ్యులకు భృతి ఇవ్వడం లేదు. ప్రతీ ఒక్కరిపై అప్పుల భారం పడుతోంది. 

► ప్రభుత్వ స్కూల్స్‌లో చేరేవారి సంఖ్య తగ్గింది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ అయినా ఎలాంటి చర్యలు లేవు. 

► నేను తప్పుడు వాగ్దానాలు ఇవ్వలేను. నన్ను మరో ఇందిర అంటారు. అలా అన్నప్పుడు నా బాధ్యత తెలుస్తుంది. ఈ డిక్లరేషన్‌ అమలు చేయలేకపోతే మా సర్కార్‌ను కూల్చేయండి. ఈ సభా వేదికపై ఉన్న నేతలంతా ఈ డిక్లరేషన్‌ను అమలుచేస్తారు. 

► మిత్రులారా అంటూ తెలుగులో మాట్లాడారు. శ్రీకాంతా చారి గురించి ప్రస్తావించారు. 

► జై బోలో తెలంగాణ అని ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రియాంక గాంధీ. 

► ఐదు అంశాలతో కాంగ్రెస్‌ యూత్‌ డిక్లరేషన్‌
1. ఉద్యమ అమరుల కుటుంబానికి నెలకు రూ.25వేల పెన్షన్
2. ప్రతీ నిరుద్యోగికి నెలకు రూ.4వేల భృతి. 
3. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాల భర్తీ. 
4. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందిన కంపెనీల్లో స్థానికులకే 75శాతం ఉద్యోగాలు. 
5. నిరుద్యోగ యువతకు రూ. 10లక్షల చొప్పున వడ్డీ రుణాలు. 

► తెలంగాణలో ప్రియాంక గాంధీ తొలి రాజకీయ సభ ఇది. 

► టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. 

► 140 మంది కాంగ్రెస్‌ సభ్యత్వ బీమా చెక్కులు అందజేసిన ప్రియాంక గాంధీ.

►  ప్రియాంకకు భట్టి విక్రమార్క పోచంపల్లి చీర ప్రదానం చేశారు. ఈ సందర్బంగా పోచంపల్లి చీరల ప్రత్యేకతను తెలిపారు. 

► సరూర్‌నగర్‌ సభ వద్దకు చేరుకున్న ప్రియాంక గాంధీ.

 కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

► కాంగ్రెస్‌ సభకు గద్దర్‌ వచ్చారు. ఈ సందర్బంగా గద్దర్‌ మీడియాతో మాట్లాడుతూ.. నెలరోజుల్లో పార్టీ ప్రకటన చేస్తాను. పీసీసీ ఆహ్వానంతో కాంగ్రెస్‌ యువ గర్జన సభకు వచ్చాను. కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య పార్టీ. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి.‍ అన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తాయి. కేసీఆర్‌పైనే నేను పోటీ చేస్తాను. 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ప్లాన్స్‌ రచిస్తోంది. ఇందులో భాగంగానే సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే ‘యువ సంఘర్షణ సభ’కోసం కాంగ్రెస్‌ స్థానిక నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సభకు కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ రానున్నారు. 

► ఈ సభలో ప్రియాంక.. యూత్‌ డిక్లరేషన్‌ ప్రకటించనున్నారు. 140 మందికి కాంగ్రెస్‌ సభ్యత్వ బీమా చెక్కులను ప్రియాంక అందజేయనున్నారు.  

వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీనగర్‌ శ్రీకాంతాచారి విగ్రహం నుంచి సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం వరకు కాంగ్రెస్‌ ‘నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ర్యాలీ నిర్వహించనుంది. 

 కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా ఈ ర్యాలీలో, సరూర్‌నగర్‌ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 సరూర్‌నగ ర్, ఎల్బీనగర్‌ పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగనున్నా యి. విజయవాడ హైవే, సాగర్‌రోడ్డు నుంచి వచ్చే వాహనాలను ఇటు చంపాపేట వైపు, అటు నాగోల్‌ వైపు మళ్లించనున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వచ్చే వాహనాలను చైతన్యపురి సిగ్నల్‌ నుంచి నాగోల్‌ వైపు మళ్లిస్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement