ఘోరం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..! | Saroornagar: Man Assassinated Toddler For barrier Extra Marital Affair | Sakshi
Sakshi News home page

ఫిట్స్‌ అని నమ్మించి.. చాతీపై తీవ్రంగా కొట్టి..

Published Thu, Apr 1 2021 8:10 AM | Last Updated on Thu, Apr 1 2021 8:37 AM

Saroornagar: Man Assassinated Toddler For barrier Extra Marital Affair - Sakshi

రోహిత్‌ మృతదేహం, నిందితుడు రాజు

మానవత్వం మంటగలిసింది.. కామంతో కళ్లు మూసుకుపోయి.. విచక్షణ కోల్పోయి.. రాక్షసత్వం ఆవహించి.. అభం శుభం ఎరుగని ఏడాదిన్నర వయసున్న బాలుడ్ని హత్య చేశాడో దుర్మార్గుడు. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని గుట్టుచప్పుడు కాకుండా బాలుడ్ని అంతమొందించి ఫిట్స్‌తో చనిపోయాడని నమ్మించాడు. చివరకు పోలీసుల విచారణలో అసలు నిజం బయటపెట్టాడు.

సాక్షి, హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బర్మా మౌనిక అనే మహిళ భర్త అజయ్‌లాల్‌తో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. వీరికి రోహిత్‌ (18 నెలలు) అనే బాలుడు ఉన్నాడు. ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌ కోదండరాంనగర్‌లో నివాసం ఉండే వాషింగ్‌మెషిన్‌‌ టెక్నీషియన్‌ మద్దికుంట రాజుతో వివాహేతర సంబంధం ఏర్పడి, మౌనిక అతనితో కలిసి అక్కడే సహజీవనం చేస్తోంది. ఈ నెల 28న మౌనిక పనిమీద బయటకు వెళ్లగా.. ఇదే అదనుగా భావించిన రాజు బాలుడ్ని అడ్డు తొలగించుకోవాలని భావించి తీవ్రంగా చాతీపై కొట్టాడు. దీంతో గాయపడిన బాలుడికి.. ఫిట్స్‌ వచ్చాయని ఇరుగుపొరుగు వారిని నమ్మించి, మౌనికకు ఫోన్‌ చేసి చెప్పి స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మౌనిక రోదిస్తూ తన భర్త అజయ్‌లాల్‌కు ఫోన్‌ చేసి బాబు ఫిట్స్‌తో చనిపోయాడని తెలి్పంది.

అయితే వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన అజయ్‌లాల్‌ (బోరబండ, మధురానగర్‌ నివాసి) మొదట పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతిగా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు 29న ఉదయం సరూర్‌నగర్‌ పోలీసులకు కేసు బదిలీ చేశారు. అజయ్‌లాల్‌ ఇచ్చిన వివరాల ఆధారంగా ఇన్‌స్పెక్టర్‌ సీతారాం, ఎస్‌ఐ రవికుమార్‌లు కోదండరాంనగర్‌లోని మద్దికుంట రాజు ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. బాబు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక ఆధారంగా బయటకు కనబడని గాయాల వల్లే బాబు ప్రాణాలు పోయినట్లు తేలింది. దీంతో అనుమానంతో మద్దికుంట రాజును పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే కొట్టి చంపినట్లు ఒప్పుకున్నాడు. బాలుడి తండ్రి ఫిర్యాదుతో రాజు వేసిన పథకం బెడిసి కొట్టింది. ఈ మేరకు నిందితుడ్ని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: నిత్య పెళ్లికొడుకు: ఒకరిద్దరు కాదు.. ఏకంగా 9 మంది..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement