
సాయికుమార్(ఫైల్)
సాక్షి, ఘట్‌కేసర్: వివాహేతర సంబంధం కారణంగా ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని బాలాజీనగర్‌లో నివాసముండే ఆమర్లపూడి సాయికుమార్(35), సునీతకు 12 ఏళ్ల కిందట ప్రేమ వివాహం జరిగింది. నవనీత అనే మహిళతో సాయికుమార్ అక్రమ సంబంధం పెట్టుకొని తరచు ఫోన్‌లో మాట్లాడుతుండేవాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య పద్ధతి మార్చుకోవాలని భర్తను హెచ్చరించింది.
దీంతో తన వివాహేతర సంబంధం గురించి ఇంట్లో తెలిసిపోయిందని.. ఈనెల 30న సునిత ఉద్యోగానికి వెళ్లగా కుమారుడిని అత్తగారింటికి పంపించి ఇంట్లో చున్నీతో ఉరి పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సునీత స్థానికుల సాయంతో కల్కి ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే మరణించాడని తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
చదవండి: యువతి పట్ల అసభ్యకర ప్రవర్తన.. బస్ దిగే లోపు పోలీసుల ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment