నగరంలోని సరూర్‌నగర్ చెరువులో 30 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు.
దిల్‌సుఖ్నగర్ (హైదరాబాద్) : నగరంలోని సరూర్‌నగర్ చెరువులో 30 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానికుల సమాచారంతో పోలీసులు చెరువు దగ్గరకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడి ముఖంపై రక్తపు మరకలు ఉండడంతో హత్య జరిగిందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.