న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు అక్టోబర్‌లో రూ.1.52 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2021 ఇదే నెలతో పోల్చితే ఈ వసూళ్లు 16.5 శాతం అధికం. ఇక ఈ స్థాయిలో వసూళ్లు జరగడం జీఎస్‌టీ చరిత్రలో రెండవసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు రికార్డు స్ధాయిలో రూ.1.68 లక్షల కోట్లు నమోదుకాగా, సెప్టెంబర్‌లో ఈ విలువ రూ.1.48 లక్షల కోట్లుగా ఉంది.
పండుగల సీజన్‌లో ఎకానమీ ఉత్సాహభరిత క్రియాశీలతను తాజా గణాంకాలు ప్రతిబింబిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు..
► అక్టోబర్‌లో మొత్తం రూ.1,51,718 కోట్ల వసూళ్లు జరిగాయి. ఇందులో సెంట్రల్ జీఎస్‌టీ రూ.26,039 కోట్లు. స్టేట్ జీఎస్‌టీ రూ.33,396 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.81,778 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.37,297 కోట్లుసహా). సెస్ రూ.10,505 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.10,505 కోట్లుసహా)
► జీఎస్‌టీ వసూళ్లు వరుసగా 8 నెలలుగా రూ.1.40 లక్షల కోట్లు పైబడ్డాయి. ఇందులో రెండు నెలలు రూ.1.50 లక్షల కోట్లు దాటాయి.
► 2022 సెప్టెంబర్ నెలలో 8.3 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ ఆయ్యాయి. 2022 అక్టోబర్ నెలలో ఈ సంఖ్య 7.7 కోట్లుగా ఉంది.
జీఎస్‌టీ.. రెండో భారీ వసూళ్లు
Published Wed, Nov 2 2022 4:39 AM | Last Updated on Wed, Nov 2 2022 10:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment