శివాజీనగర(బెంగళూరు): ఇప్పటికే పలు రకాల భారాలతో అయ్యో అంటున్న సామాన్య ప్రజలకు మరో భారం పొంచి ఉంది. ప్రైవేటు హాస్టళ్లు (పీజీ)ల బాడుగ ఫీజుకు జీఎస్టీ సెగ తగలనుంది. విద్యార్థులు, బ్యాచిలర్‌లు, ఒంటరి ఉద్యోగులకు ఆదరువుగా పీజీలు ఉండడం తెలిసిందే. నగరంలో వేలాది మంది పీజీల్లో వసతి పొందుతూ వృత్తి ఉద్యోగాలను, చదువులను కొనసాగిస్తున్నారు.
కొత్త జీఎస్టీ నియమాల ప్రకారం రోజు బాడుగ రూ. వెయ్యి కంటే తక్కువ అయితే 12 శాతం జీఎస్‌టీ, వెయ్యి కంటే ఎక్కువైతే 18 శాతం జీఎస్‌టీ విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. బెంగళూరులోని జీఎస్‌టీ పీఠం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఫలితంగా బాడుగల్ని పెంచడం తప్పదని బెంగళూరు పీజీ యజమానుల క్షేమాభివృద్ధి సంఘం వెల్లడించింది. జీఎస్‌టీని వసతిదారుల నుంచే వసూలు చేస్తామని తెలిపింది. ఇప్పటికే బెంగళూరులో పీజీల బాడుగ ఎక్కువగా ఉందని వసతిదారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment