
దేశంలో జీఎస్టీ వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మార్చి నెలలో 13 శాతం వృద్దితో రూ.1.60 లక్షల కోట్ల వసూళ్లు జరిగినట్లు కేంద్ర ఆర్ధిక శాఖ అధికారికంగా ప్రకటించింది.
మార్చినెలలో మొత్తం జీఎస్టీ వసూళ్ల వివరాల్ని పరిశీలిస్తే.. సీజీఎస్టీ రూ.29,546 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.37,314 కోట్లు, ఐజీఎస్టీ రూ.82,907 కోట్లు, సెస్ రూ.10,355 కోట్లు కలెక్షన్లను రాబట్టినట్లు ఆర్ధిక శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
గత ఆర్ధిక సంవత్సరం (2022-2023) లో వరుసగా నాల్గవ సారి రూ.1.5లక్షల కోట్లు దాటగా.. జీఎస్‌టీని అమల్లోకి తెచ్చినప్పటి నుంచి ఈ వసూళ్లు రూ.1.60లక్షల కోట్లు దాటడం (మార్చి నెలలో)ఇది రెండోసారి అని ఆర్ధిక శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment