Wipro Ceo Salary Per Month: Wipro CEO Thierry Delaporte Earned 8.7 Million Dollars Last year - Sakshi
Sakshi News home page

విప్రో సీఈఓకే వేతనం ఎక్కువ.. ఎంతంటే?

Published Fri, Jun 11 2021 3:37 PM | Last Updated on Fri, Jun 11 2021 4:34 PM

Wipro CEO Thierry Delaporte Earned 8.7 Million Dollars Last year - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజ సంస్థ విప్రో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) థియరీ డెలాపోర్ట్‌ 2020-21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.64.3 కోట్ల (దాదాపు 8.7 మిలియన్‌ డాలర్లు) వేతన ప్యాకేజ్‌ అందుకున్నారు. 2020 జూలై 6 నుంచి 2021 మార్చి 31వ తేదీ మధ్య కాలానికి డెలాపోర్ట్‌ ఈ వేతనాన్ని అందుకున్నట్లు సంస్థ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇందులో ఒన్‌టైమ్‌ క్యాష్, స్టాక్‌ గ్రాంట్, ఆర్‌ఎస్‌యూ (రిస్ట్రక్టెడ్‌ స్టాక్‌ యూనిట్స్‌) ఒన్‌టైమ్‌ గ్రాంట్‌ కలిసి ఉన్నాయని తెలిపింది. అబిదాలి నీముచ్వాలా వారసునిగా జూలై 6వ తేదీన విప్రోలో చేరారు. 

అంతకుముందు ఆయన క్యాప్‌జెమినీ ఎగ్జిక్యూటవ్‌గా పనిచేశారు. భారత్‌ ఐటీ సేవల రంగంలో అత్యధిక వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌గా నిలిచారు. ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ వార్షిక వేతనం 2020-21లో రూ.49.68 కోట్లు. 2019-20లో ఈ ప్యాకేజ్‌ రూ.34.27 కోట్లు. ఇక టీసీఎస్‌ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ గోపాలన్‌ వేతనం 2020-21లో రూ.20.36 కోట్లు. కాగా, విప్రో చైర్మన్‌ రషీద్‌ ప్రేమ్‌జీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 1.61 మిలియన్‌ డాలర్ల వేతనం తీసుకుంటే, ప్రెసిడెంట్‌ అండ్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ అందుకున్న మొత్తం 1.01 మిలియన్‌ డాలర్లు.

చదవండి: కోవిడ్ పోరులో భారీగా ఖర్చు చేసిన టాటా గ్రూప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement