
న్యూఢిల్లీ: దేశీయంగా సెమీకండక్టర్ల తయారీ త్వరలోనే ప్రారంభం కాగలదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అల్కేశ్ కుమార్ శర్మ తెలిపారు. చిప్‌ల తయారీలో టాప్ 6–7 భాగస్వాముల్లో ఒకటిగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు.
తిరువనంతపురంలోని సీ–డీఏసీ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా శర్మ ఈ విషయాలు చెప్పారు. భారతీయ ప్రమాణాలకు, అధునాతన మీటరింగ్ విధానానికి అనుగుణంగా ఉండే స్మార్ట్ ఎనర్జీ మీటర్‌ను సీ–డీఏసీ తయారు చేసింది. వీటితో విద్యుత్ వినియోగం తగ్గుతుందని, బిల్లింగ్ సక్రమంగా ఉండటంతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రయోజనకరంగా ఉంటుందని శర్మ వివరించారు.