'ఐటీ సెక్టార్ లో 20-25 లక్షల ఉద్యోగాలు'
'ఐటీ సెక్టార్ లో 20-25 లక్షల ఉద్యోగాలు'
Published Tue, May 23 2017 7:26 PM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM
న్యూఢిల్లీ : ఐటీ ఇండస్ట్రి ఇంకేముంది? భారీ ఎత్తున్న కుప్పకూలిపోతుంది.. ఓ వైపు అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్, మరోవైపు ముంచుకొస్తున్న ఆటోమేషన్ ప్రభావంతో భారీగా ఉద్యోగాల కోత ఉంటుందంటూ రిపోర్టులు వస్తున్నాయి. కానీ ఈ రిపోర్టులన్నీ అసత్యమేనని ఇప్పటికే ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్ ప్రకటించగా.. తాజాగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ఆ రిపోర్టులను కొట్టిపారేస్తున్నారు. వచ్చే నాలుగు నుంచి ఐదేళ్లలో ఐటీ సెక్టార్ లో 20 లక్షల నుంచి 25 లక్షల అదనపు ఉద్యోగాల కల్పన ఉంటుందని హామీ ఇచ్చారు. ఐటీ రంగంలో ఉద్యోగవకాశాలు పడిపోతున్నాయనే రిపోర్టులను తాను పూర్తిగా ఖండిస్తున్నానని, ఒక్కసారి డిజిటల్ టెక్నాలజీ వచ్చాక, ఏమేర ఉద్యోగవకాశాలు పెరుగుతాయో మీరే చూస్తారంటూ మంత్రి చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా 200 నగరాల్లో, 80 దేశాల్లో భారతీయ ఐటీ ఇండస్ట్రి విస్తరించి ఉందని, ప్రత్యక్షంగా 40 లక్షలమందికి, పరోక్షంగా 1.3 కోట్ల మందికి ఇది ఎంప్లాయీమెంట్ కల్పిస్తుందని పేర్కొన్నారు. నాస్కామ్ అంచనాల ప్రకారం వచ్చే నాలుగు నుంచి ఐదేళ్లలో ఐటీ పరిశ్రమలో సుమారు 20-25 లక్షల అదనపు ఉద్యోగాలు ఖాయమని తెలిపారు. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో దేశీయ డిజిటల్ ఎకానమీ 1 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంటే 600 లక్షల కోట్లని పేర్కొన్నారు. గత మూడేళ్లలో దేశీయ ఐటీ రంగంలో సుమారు ఆరు లక్షల మందికి ఉద్యోగవకాశాలు లభించినట్టు తెలిపారు. 2016-17లో 1.7 లక్షల మంది ఉద్యోగాలు పొందారని చెప్పారు.
Advertisement
Advertisement