ఐటీ జాబ్స్‌కు అదే జోష్‌! | no negative impact on it jobs in pandemic | Sakshi
Sakshi News home page

ఐటీ జాబ్స్‌కు అదే జోష్‌!

Dec 24 2020 3:52 PM | Updated on Dec 24 2020 3:52 PM

no negative impact on it jobs in pandemic  - Sakshi

సాక్షి, ముంబై: కోవిడ్‌-19 వైరస్‌తో దేశంలోని అన్ని పరిశ్రమలల్లో ఉద్యోగుల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంటే.. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో మాత్రం జోష్‌ తగ్గలేదు. బెంగళూరు, పుణే వంటి నగరాల్లోని ఐటీ ఉద్యోగులకు ఆర్ధిక భరోసా అందిందని జాబ్‌ ఫ్లాట్‌ఫామ్‌ స్కైకీ మార్కెట్‌ నెట్‌వర్క్‌ తెలిపింది. నవంబర్‌ నెలలో ఐటీ ప్రాజెక్ట్‌ మేనేజర్, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్, టెస్టర్, కన్సల్టెంట్, డిజిటల్‌ మార్కెటింగ్‌ విభాగాల్లోని ఉద్యోగాలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగిందని పేర్కొంది. కరోనా వైరస్‌తో అన్ని వ్యాపారాలకు డిజిటల్‌లోకి మారుతుండటం, సాంకేతిక వినియోగం పెరగడం వంటివి ఐటీ రంగం, ఉద్యోగుల వృద్ధికి కారణమని తెలిపింది. 2020 నాటికి దేశీయ ఐటీ రంగంలో 43.6 లక్షల మంది ఉద్యోగులున్నారు. నవంబర్‌లో 50 శాతానికి పైగా కొత్త ఉద్యోగ నియామకాలు బెంగళూరు, పుణే, హైదరాబాద్, ఢిల్లీ నగరాల నుంచి వచ్చాయి. ఐటీ రంగంలో ఏటా రూ.25 లక్షల ఎక్కువ వేతనం పొందుతున్న నగరాల్లో బెంగళూరు, పుణేలున్నాయని స్కైకీ కో–ఫౌండర్‌ కరుంజిత్‌ కుమార్‌ ధీర్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement