న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన యూజ్డ్ కార్ డీలర్స్ కంపెనీ కార్వానా కూడా భారీ ఎత్తున ఉద్యోగాలపై కోత విధించింది. ఇటీవలికాలంలో తమ మార్కెట్ బాగా దెబ్బతినడం, భవిష్యత్‌పై ఆందోళనల కారణంగా దాదాపు 1,500 మంది అంటే మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 8 శాతం మందిని తొలగించింది. పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వాడిన కార్లకు డిమాండ్ పడిపోవడం ఇటీవలి కాలంలో కార్వానా షేరు రికార్డు స్థాయికి కుప్పకూలిన నేపథ్యంలో కంపెనీ సీఈవో ఒక ఉద్యోగులకు ఈమెయిల్ సందేశాన్ని పంపారు.
"ఈ రోజు చాలా కష్టతరమైన రోజు" అంటూ కార్వానా సీఈవో ఎర్నీ గార్సియా శుక్రవారం ఉద్యోగులకుఇమెయిల్ సమాచారాన్ని అందించారు ఆకాశాన్నంటుతున్న ధరలు, సరఫరా కొరత నేపథ్యంలో ఉపయోగించిన కార్లకు డిమాండ్ తగ్గుతుండటంతో ఆర్థిక ప్రతికూలతలను ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నారు. ఇదంతా ఎలా జరుగుతుందో, వ్యాపారంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో ఖచ్చితంగా అంచనా వేయడంలో కంపెనీ విఫలమైందని ఆయన చెప్పారు.(తగ్గేదేలే: మస్క్ కొత్త పాలసీ, అలా చేస్తే అంతే!)
ఇదీ చదవండి: ఆకాశ ఎయిర్ దూకుడు:వైజాగ్-బెంగళూరు రూటు టార్గెట్
తాజాగా కార్వానా స్టాక్ 3.1శాతం క్షీణించి ఒక్కో షేరుకు 8.06 డాలర్లు వద్ద ముగిసింది. ఆగస్ట్ 10, 2021న ఒక్కో షేరుకు 376.83 డాలర్ల వద్ద ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. కాగా కార్వానా స్టాక్ ఈ సంవత్సరం దాదాపు 97శాతం క్షీణించింది. ఆటోమేటెడ్ కార్ వెండింగ్ మెషీన్‌లకు ప్రసిద్ధి చెందిన కంపెనీ, ఈ ఏడాది ప్రారంభంలో ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో దాదాపు 2,500 మంది ఉద్యోగులను లేదా 12 శాతం మంది ఉద్యోగులను తొలగించింది.(యూకే నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్..కాస్ట్లీ గిఫ్ట్..కట్ చేస్తే!)
Comments
Please login to add a commentAdd a comment