బెర్లిన్: వచ్చే ఏడాది(2014)లోగా ప్రపంచవ్యాప్తంగా 15,000 ఉద్యోగాలలో కోత పెట్టనున్నట్లు జర్మన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ దిగ్గజం సీమెన్స్ తెలిపింది. వీటిలో 5,000 మంది వరకూ ఉద్యోగులను ఒక్క జర్మనీలోనే తగ్గించుకోనున్నట్లు వెల్లడించింది. వ్యయాల కోతలో భాగంగా సిబ్బందిని తగ్గించుకోనున్నామని కంపెనీ పేర్కొంది. తద్వారా 810 కోట్ల డాలర్లను(రూ. 51,000 కోట్లు) ఆదా చేయనున్నట్లు వివరించింది.
కంపెనీ గ్యాస్ టర్బైన్లు, రైల్ పరికరాలు, హెల్త్‌కేర్, ఎలక్ట్రానిక్ ఆధారిత పలు ఉత్పత్తులను తయారు చేస్తుంది. కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 3,70,000 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్క జర్మనీలోనే 1,19,000 మంది సిబ్బందిని కలిగి ఉంది. తొలుత ఈ ఏడాది(2013) చివరికల్లా 10,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. కాగా, భారత్‌లో కూడా సీమెన్స్‌కు అనుబంధ సంస్థ ఉంది.
సీమెన్స్‌లో 15,000 ఉద్యోగాల కోత!
Published Mon, Sep 30 2013 12:28 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
Advertisement