దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌కు కొన్ని నిబంధనలలో కూడిన సడలింపులు ఇవ్వడంతో 2 కోట్ల మంది కార్మికులు తిరిగి పనుల్లో చేరారు. సడలింపులతో కొన్ని కంపెనీల కార్యాలయాలు, పరిశ్రమలు తెరుచుకోవడంతో భారతీయుల ఎంప్లాయిమెంట్ రేటు 2 శాతం పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం ఏప్రిల్‌లో ఎంప్లాంయిమెంట్ రేటు 27 శాతంగా ఉండగా అది మే నాటికి 2 శాతం పెరిగి 29 శాతానికి చేరింది. మార్చి 25 నుంచి లాక్‌డౌన్ కారణంగా 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఈ నివేదిక వెల్లడించింది. ఇక పరిశ్రమల్లో పనిచేసే లేబర్ పార్టిసిపేషన్ రేట్(ఎల్‌పీఆర్) వారం వారం పెరుగుతోందని మే 17 నాటికి ఇది 38.8 శాతం పెరిగిందని సీఎంఐఈ వెల్లడించింది. ఎల్‌పీఆర్ మార్చిలో 41.9 శాతంగా ఉందని అది ఏప్రిల్ నాటికి 35.6 శాతానికి తగ్గి మేనెలలో మరింత పుంజుకుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment