ప్రగతి భవన్‌లో మాట్లాడుతోన్న తెలంగాణ సీఎం కేసీఆర్
హైదరాబాద్ : ఉద్యోగ సంఘాల నాయకులతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాల నాయకుల సమస్యలపై మంత్రి వర్గ ఉప సంఘంతో కలసి ప్రగతి భవన్‌లో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని, సెలవు దినాల్లో కూడా ఉద్యోగులు పని చేశారని కొనియాడారు. రెవిన్యూ రికార్డులను విజయవంతంగా ప్రక్షాళన చేశామని వెల్లడించారు. రెవిన్యూ వసూళ్లలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, పీఆర్‌సీపై త్రిసభ్య కమిటీ వేశామని, ఆగస్టు 15 లోపు రిపోర్టు వచ్చేలా ఆదేశిస్తామని చెప్పారు.
బదిలీల విధివిధానాలపై అజయ్ మిశ్రా అధ్యక్షతన కమిటీ వేశామని, ఉద్యోగుల బదిలీల్లో దంపతులకు ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు. జోనల్ విధానంపై కేబినేట్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కేసీఆర్ కిట్ల వల్ల ప్రభుత్వ వైద్యులపై మూడు రెట్ల పని భారం పెరిగిందని, వారి సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment