ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ 400 మంది సీనియర్ అధికార స్థాయి ఉద్యోగులను తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్స్, సీనియర్ డైరెక్టర్స్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్స్(ఏపీపీఎస్), వీపీఎస్,ఎస్‌వీపీఎస్‌లను స్వచ్చందంగా పదవీవిరమణ చేయమని కాగ్నిజెంట్ కంపెనీ అడగవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రెండేళ్ల క్రితం కూడా సీనియర్, డైరెక్టర్‌స్థాయి ఉద్యోగులు 200 మందిని తొలగించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదికూడా 400 మంది సీనియర్ ఉద్యోగులను వలంటరీ సపరేషన్ స్కీము కింద స్వచ్చందంగా ఉద్యోగాల నుంచి తప్పుకోమని ఈ కంపెనీ అడగనుంది.కాగా కాగ్నిజెంట్ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా 2,90,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ వ్యయాలను తగ్గించుకునేందుకు, డిమాండ్ సప్లై ఆధారంగా ఉద్యోగులను విభజించి కొంత మేర ఉన్నతస్థాయి అధికార యంత్రాంగాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో కాగ్నిజెంట్ ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment