
ముంబై: చెల్లింపుల లావాదేవీల్లో మోసాల ఉదంతాలను పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు ఫిర్యాదు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ కొత్తగా దక్ష్ పేరిట అధునాతన వ్యవస్థను రూపొందించింది. ఇది జనవరి 1 నుంచి అందుబాటులోకి రానున్నట్లు, ఇప్పటివరకూ ఉన్న ఫ్రాడ్ రిపోర్టింగ్ మాడ్యూల్‌ను దీనికి మార్చనున్నట్లు తెలిపింది.
పేమెంట్ ఫ్రాడ్‌లను బల్క్‌గా అప్‌లోడ్ చేయడంతో పాటు ఆన్‌లైన్ స్క్రీన్–ఆధారిత రిపోర్టింగ్, అలర్టులను జారీ చేయడం, నివేదికలను రూపొందించడం తదితర ఆప్షన్లు కూడా ఇందులో ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం పేమెంట్ ఫ్రాడ్‌లను ఫిర్యాదు చేసేందుకు ఎలక్ట్రానిక్ డేటా సబ్మిషన్ పోర్టల్ (ఈడీఎస్‌పీ)ని ఉపయోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment