Operators
-
5జీ స్పెక్ట్రమ్ వేలం.. రూ.11వేల కోట్ల బిడ్లు
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రమ్ వేలం మొదటి రోజున మంచి డిమాండ్ కనిపించింది. మంగళవారం మొత్తం ఐదు రౌండ్లలో టెలికం ఆపరేటర్లు రూ.11వేల కోట్ల మేర బిడ్లు దాఖలు చేశారు. రూ.96,238 కోట్ల విలువ చేసే 10,500 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను కేంద్ర ప్రభుత్వం వేలానికి ఉంచింది. 900, 1800, 2100, 2500 మెగాహెర్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రమ్ కోసం ఆపరేటర్లు ఆసక్తి చూపించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వేలంలో పాల్గొన్నాయి.అత్యధికంగా రిలయన్స్ జియో రూ.3,000 కోట్లను ముందస్తుగా డిపాజిట్ చేసింది. దీంతో ఎక్కువ స్పెక్ట్రమ్ కోసం రిలయన్స్ పోటీ పడనున్నట్టు తెలుస్తోంది. భారతీ ఎయిర్టెల్ రూ.1,050 కోట్లను, వొడాఫోన్ రూ.300 కోట్ల చొప్పున డిపాజిట్ చేశాయి. 2010లో ఆన్లైన్లో బిడ్డింగ్ మొదలైన తర్వాత ఇది పదో విడత స్పెక్ట్రమ్ వేలం కావడం గమనార్హం. కేంద్ర సర్కారు చివరిగా 2022 ఆగస్ట్‌లో వేలం నిర్వహించింది. వేలం బుధవారం తిరిగి ప్రారంభమవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఫోన్లో నెట్వర్క్ లేకున్నా.. ఎమర్జెన్సీ కాల్స్ ఎలా వెళ్తాయో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత జనరేషన్లో ఫోన్ గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. ఇక, ఫోనులో నెట్వర్క్ లేకపోయినప్పటికీ ఎమర్జెన్సీ కాల్ చేసే ఆప్షన్ కనిపించడాన్ని మనం చాలాసార్లు గమనించే ఉంటాం. ఎవరైనాసరే ఎటువంటి నెట్వర్క్ అవసరం లేకుండా ఎమర్జెన్సీ నంబర్లకు కాల్ చేయవచ్చు. ఎమర్జెన్సీ కాల్లో పోలీసులకు, అంబులెన్స్ మొదలైనవాటికి ఫోను చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, నెట్వర్క్ లేకుండా ఫోన్ ఎలా పనిచేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. మీ ఫోనులో నెట్వర్క్ లేదంటే దాని అర్థం ఆపరేటర్ నుంచి నెట్ వర్క్ అందడం లేదని అర్థం. ఇటువంటి స్థితిలో ఎమర్జెన్సీ కాల్ మరో పద్ధతిలో కనెక్ట్ అవుతుంది. మీ ఫోనుకు మీ ఆపరేటర్ నుంచి నెట్వర్క్ కనెక్ట్ కాకపోతే.. ఆటోమేటిక్‌గా అదే ఏరియాలో అందుబాటులో ఉన్న మరో మొబైల్ నెట్వర్క్ నుంచి కాల్ కనెక్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఇటువంటి స్థితిలో ఎమర్జెన్సీ కాల్ ఏదైనా ఇతర నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఇటువంటి సమయంలో సాధారణ కాల్ కనెక్ట్ అవదు. కేవలం ఎమర్జెన్సీ కాల్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి. మీరు ఎప్పుడు ఎమర్జెన్సీ కాల్ చేసినా ఏ నెట్ వర్క్‌తో అయినా కనెక్ట్ అయ్యే అవకాశం కలుగుతుంది. కాగా, ఎమర్జెన్సీ కాల్స్ చేసే సమయంలో ప్రత్యేకమైన నెట్వర్క్ ఉండాలన్న నియమం ఏదీ లేదు. ఈ కారణంగానే ఎమర్జెన్సీ కాల్ ఎప్పుడైనా చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాల్ ఎలా కనెక్ట్ అవుతుందంటే.. సాధారణంగా ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ముందుగా ఆ ఫోను మాధ్యమం ద్వారా సమీపంలోని నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ టవర్‌కు మెసేజ్ చేరుకుంటుంది. అప్పుడు ఫోనుకు కాల్ కనెక్ట్ అవుతుంది. ఈ ప్రక్రియ కొద్ది సెకెన్ల వ్యవధిలోనే జరుగుతుంది. ఫలితంగానే మీరు వెంటనే అవతలి వ్యక్తితో మాట్లాడగలుగుతారు. ఇది కూడా చదవండి: జియో, ఎయిర్టెల్ దెబ్బకు లక్షల యూజర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా -
పేమెంట్ మోసాలపై ఫిర్యాదులకు ఆర్బీఐ దక్ష్
ముంబై: చెల్లింపుల లావాదేవీల్లో మోసాల ఉదంతాలను పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు ఫిర్యాదు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ కొత్తగా దక్ష్ పేరిట అధునాతన వ్యవస్థను రూపొందించింది. ఇది జనవరి 1 నుంచి అందుబాటులోకి రానున్నట్లు, ఇప్పటివరకూ ఉన్న ఫ్రాడ్ రిపోర్టింగ్ మాడ్యూల్‌ను దీనికి మార్చనున్నట్లు తెలిపింది. పేమెంట్ ఫ్రాడ్‌లను బల్క్‌గా అప్లోడ్ చేయడంతో పాటు ఆన్లైన్ స్క్రీన్–ఆధారిత రిపోర్టింగ్, అలర్టులను జారీ చేయడం, నివేదికలను రూపొందించడం తదితర ఆప్షన్లు కూడా ఇందులో ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం పేమెంట్ ఫ్రాడ్‌లను ఫిర్యాదు చేసేందుకు ఎలక్ట్రానిక్ డేటా సబ్మిషన్ పోర్టల్ (ఈడీఎస్పీ)ని ఉపయోగిస్తున్నారు. -
యూటెల్శాట్తో వన్‌వెబ్ విలీనం
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కి చెందిన ఉపగ్రహాల ఆపరేటర్ యూటెల్‌శాట్, కమ్యూనికేషన్స్ నెట్వర్క్ వన్‌వెబ్ విలీనం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ డీల్ పూర్తిగా షేర్ల మార్పిడి రూపంలో ఉండనుంది. ఇరు సంస్థల సంయుక్త ప్రకటన ప్రకారం వన్‌వెబ్ విలువను 3.4 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 27,000 కోట్లు) లెక్కకట్టారు. ప్రస్తుతం వన్‌వెబ్‌లో కీలక భాగస్వామి అయిన దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ .. డీల్ పూర్తయిన తర్వత యూటెల్‌శాట్‌లో అతి పెద్ద వాటాదారుగా ఉండనుంది. విలీన సంస్థకు ఎయిర్టెల్ చీఫ్ సునీల్ భారతి మిట్టల్ కో–చైర్మన్‌గాను, ఆయన కుమారుడు శ్రావిన్ భారతి మిట్టల్ .. డైరెక్టరుగా ఉంటారు. యూటెల్‌శాట్ ప్రస్తుత చైర్మన్ డొమినిక్ డి హినిన్ .. విలీన సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. డీల్ ప్రకారం వన్‌వెబ్ షేర్హోల్డర్లకు యూటెల్‌శాట్ కొత్తగా 23 కోట్ల షేర్లను జారీ చేస్తుంది. తద్వారా పెరిగిన షేర్ క్యాపిటల్‌లో ఇరు సంస్థల షేర్‌హోల్డర్ల వాటా చెరి 50 శాతంగా ఉండనుంది. వన్‌వెబ్‌లో 100 శాతం వాటాలు యూటెల్‌శాట్‌కు దఖలుపడతాయి. 2023 ప్రథమార్ధంలో ఈ డీల్ పూర్తి కావచ్చని అంచనా. యూటెల్‌శాట్‌కు 36 జియోస్టేషనరీ ఆర్బిట్ (జియో) ఉపగ్రహాలు ఉండగా, వన్‌వెబ్‌కు 648 లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 428 ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి. -
వెట్టిచాకిరి!
► సీఆర్డీఏలో ఆపరేటర్లు, అటెండర్ల విధులు దుర్భరం ► రెండేళ్లుగా రాత్రింబవళ్లు పనిచేసినా పెరగని వేతనం ► రోజువారీ కూలీలుగానే పరిగణిస్తున్న అధికారగణం ► జీవో 151 ఉన్నా పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు ► బతుకులు మారేదెలా అంటూ కన్నీటి పర్యంతం రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండేళ్లుగా రేయింబవళ్లు కష్టపడుతున్నారు. వారు లేనిదే భూములకు సంబంధించిన పాత, కొత్త రెవెన్యూ రికార్డులు బయటకు రాని పరిస్థితి. చివరకు చిన్న పేపర్ జిరాక్స్ తీయాలన్నా వారే చేయాలి. రైతుల నుంచి అవసరమైన సమాచారం సేకరించే విషయంలోనూ... ప్రభుత్వం నుంచి రైతులకు ఏదైనా తెలియజేయాలన్నా కీలక పాత్ర పోషించేది కూడా వారే. మొత్తంగా వారు లేనిదే ఆ 33 వేల ఎకరాలు సమీకరించడం కష్టమయ్యేది. అటువంటి ఆపరేటర్లు, అటెండర్లకు వేతనాలు పెంచటంలో వివక్ష చూపుతున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో : రాజధాని పరిధిలో 26 యూనిట్లలో 52 మంది ఆపరేటర్లు, మరో 52 మంది అటెండర్లు పనిచేస్తున్నారు. వీరిని 2015 జనవరిలో నియమించారు. ఆపరేటర్లకు నెలకు రూ.9,500, అటెండర్లకు నెలకు రూ.6,700 ఇస్తున్నారు. జీఓ నంబర్ 151 ప్రకారం ఆపరేటర్లకు రూ.15వేలు, అటెండర్లకు రూ.12వేలు చెల్లించాల్సి ఉంది. వేతనాలు పెంపు విషయమై వారు పలుమార్లు ఉన్నతాధికారులను కలిసి విన్నవించారు. అయితే అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. వాళ్లంతా రోజు కూలీలేనట .... ప్రభుత్వ అవసరాల కోసం నియమించిన వారిని ఉన్నతాధికారులు కొందరు రోజు కూలీల కిందే పరిగణిస్తున్నట్లు ఆపరేటర్లు, అటెండర్లు కన్నీరుపెడుతున్నారు. రాజధాని అవసరాల కోసం నియమించే సమయంలో నిబంధనల ప్రకారం వర్తించాల్సినవన్నీ వర్తిస్తాయని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వ పెద్దల అవసరాలు తీరాక... ‘ఉంటే ఉండండి, వెళ్లాలంటే వెళ్లిపోండి’ అంటూ హీనంగా చూస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో రేయింబవళ్లు పనిచేసిన ఆపరేటర్లు, అటెండర్లకు ఎటువంటి అధికారిక నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులను అడిగితే... ‘మీరు రోజు కూలీల కిందే లెక్క. పనిచేసిన రోజు కూలీ. పనిచేయని రోజు లేదు’ అని తేల్చిచెప్పినట్లు తెలిసింది. వేతనాలు, అధికారిక ఉత్తర్వుల కోసం ఎక్కడైనా, ఎప్పుడైన ధర్నా, ఆందోళనలు చేస్తే వెంటనే తొలగించి కొత్తవారిని నియమించుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. వేతనాలు పెంచి చెల్లించటం కుదరదని తేల్చిచెప్పినట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వ పెద్దల కార్యక్రమాలు ఉన్న ప్రతి రోజూ వేకువ జామునే కార్యాలయానికి చేరుకుని రాజ ధాని నిర్మాణానికి అవసరమైన రికార్డులను సిద్ధం చేసి ఇచ్చేవారు. ఆపరేటర్లు, అటెండర్లకు కనీసం సెలవులు కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లోనూ కొందరు అధికారులు వేధింపులకు గురిచేసే వారని కన్నీరుపెట్టుకున్నారు. పని పూర్తయ్యాకే వెళ్లమనే వారని, లేకపోతే ఆఫీసు నుంచి వెలుపలకు అడుగుపెట్టనిచ్చేవారు కారని భోరుమంటున్నారు. అటువంటి ఉద్యోగులకు నిబంధనల ప్రకారం వేతనాలు పెం చే విషయమై ప్రభుత్వ పెద్దలు వివక్ష ప్రదర్శిస్తుండటంపై కార్మిక సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీఏ పరిధిలో పనిచేస్తున్న ఆపరేటర్లు, అటెండర్లకు వేతనాలు పెంచటంతో పాటు... వారి నియామకాలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలని, లేకపోతే సీఆర్డీఏ కార్యాలయాల ముందు ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. -
ఆపరేటర్ల ఎంపిక వాయిదా
జిల్లాల పునర్విభజన ఎఫెక్ట్ హన్మకొండ : విద్యుత్ సబ్‌స్టేçÙ¯ŒS అపరేటర్ల నియామకంపై జిల్లాల పునర్విభజన ఎఫెక్ట్ ప డింది. దసరా రోజు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్న క్రమంలో విద్యుత్ సబ్‌స్టేçÙన్లలో ఆపరేటర్ల నియామకాలు నిలిచిపోనున్నాయి. జిల్లాలో 230 ఆపరేటర్ల పోస్టుల భర్తీకి ఎన్పీడీసీఎల్ విద్యుత్ సబ్‌స్టేçÙ¯ŒS కాంట్రాక్టర్లు నోటిఫికేష¯ŒS జారీ చేశారు. త్వరలో నియామక ప్రక్రి య మొదలు కావాల్సి ఉండగా.. కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తెరమీదకు రావడంతో నియామకాల ప్రక్రియ నిలిపివేయాలని ఎన్పీడీసీఎల్, డివిజ¯ŒS అధికారులకు ఆదేశాలు అం దాయి. దీంతో దరఖాస్తు చేసుకున్న వారు నిరాశకు గురయ్యారు. కాగా, విద్యుత్ సబ్‌స్టేష¯ŒS ఆపరేటర్ల నియామకాల్లో అక్రమాలు, అవినీతికి తావు లేదని తెలంగాణ ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ మ్యానింగ్, వర్కర్స్ స్టాఫ్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేష¯ŒS రాష్ట్ర అధ్యక్షుడు బండ కుమారస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. -
కాల్ డ్రాప్స్ నిజమే...
ఆపరేటర్లకు నోటీసులు: ట్రాయ్ న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ పరిమితికి మించి ఉన్నందున ఆపరేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్టు ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ సోమవారం ఢిల్లీలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. తాము కాల్స్ డేటాను పరిశీలించామని, సేవల నాణ్యత నిబంధనల(క్యూఓఎస్) ప్రకారం కాల్ డ్రాప్స్ అనుమతించినదాని కంటే చాలా అధికంగా ఉన్నట్టు తేలిందన్నారు. దీన్ని బట్టి ఇంటర్‌కనెక్షన్‌కు సంబంధించిన లెసైన్స్ నిబంధనలను, క్యూఓఎస్ నిబంధలను ఆపరేటర్లు పాటించలేదని తెలుస్తోందన్నారు. తమ నెట్వర్క్ నుంచి వెళ్లే కాల్స్‌కు సరిపడా ఇంటర్ కనెక్షన్ పాయింట్లు సమకూర్చలేదంటూ ప్రధాన టెలికం ఆపరేటర్లపై జియో ట్రాయ్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 80 శాతం వరకు కాల్స్ ఫెయిల్ ఘటనలు చోటు చేసుకున్నాయని, 10 రోజుల వ్యవధిలో ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా నెట్‌వర్క్‌లకు వెళ్లిన 52 కోట్ల కాల్స్ ఫెయిలైనట్టు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు కాల్స్ వివరాలను ట్రాయ్ తెప్పించుకుని పరిశీలించింది. నిబంధనల ఉల్లంఘన తేలడంతో షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్టు ట్రాయ్ చైర్మన్ శర్మ తెలిపారు. -
ఆపరేటర్ పోస్టుకు రూ. 2 లక్షలు
కాంట్రాక్టర్ల బేరసారాలు జిల్లాలో 230 పోస్టుల భర్తీకి సన్నాహాలు అధికారులపైనే నిరుద్యోగుల ఆశలు విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ పోస్టుల నియామకంలో అక్రమాలు జరుగుతున్నాయి. ఆపరేటర్ పోస్టులు ఇప్పిస్తామంటూ సబ్‌స్టేషన్ కాంట్రాక్టర్లు నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎన్పీడీసీఎల్లోని వరంగల్, వరంగల్ రూరల్ పరిధిలో ఈ దందా ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ల వసూళ్ల వ్యవహారంపై పలువురు నిరుద్యోగులు ఇప్పటికే ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులను ఆశ్రయించినట్లు తెలిసింది. సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎన్పీడీసీఎల్) పరిధిలోని 33/11 కేవీ(కిలో వాట్) సబ్‌స్టేషన్ నిర్వహణ కోసం 230 మంది ఆపరేటర్ల నియామకానికి ఆగస్టు 26న నోటిఫికేషన్ జారీ అయ్యింది. డివిజన్ల వారీగా పోస్టులు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆపరేటర్లకు వేతనాలు విద్యుత్ సబ్స్టేషన్ల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కాంట్రాక్టర్లు చెల్లిస్తారు. ఐటీఐ(ఎలక్ట్రికల్), ఇంటర్మీడియెట్ ఒకేషనల్(ఇడబ్లు్యఎన్ఈఈ) ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు. మన జిల్లాకు చెందినవారే దరఖాస్తు చేసుకోవాలని, ఐటీడీఏ పరిధిలోని ఉప కేంద్రాలకు ఆ ప్రాంతం వారే (ట్రైబల్ ఏజెన్సీ వాసులు) అర్హులు అని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సబ్ స్టేషన్ల కాంట్రాక్టర్లు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు సెప్టెంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఒకటి రెండు డివిజన్లలో ఒక్కో పోస్టుకు 50 మంది పోటీపడేలా దరఖాస్తుల సంఖ్య ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. ఇది పూర్తయితేగానీ కచ్చితమైన సంఖ్య తెలియదు. సబ్‌స్టేషన్ ఆపరేటర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రత్యేక కమిటీ చేపట్టనుంది. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ కార్యాలయంలోని టెక్నికల్ డీఈ, ఆపరేషన్ డీఈ, ఎన్పీడీసీఎల్ కేంద్ర కార్యాలయంలో పనిచేసే ఒక డీఈ, కాంట్రాక్టర్ల ప్రతినిధి ఒకరు ఈ కమిటీలో ఉంటారు. ఐటీఐ, ఇంటర్మీడియేట్ ఒకేషన్లో మెరిట్, రిజర్వేషన్, కరెంటు స్తంభాలు ఎక్కే అర్హతల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. నిబంధనలు ఇలా ఉంటే... కాంట్రాక్టర్లు మాత్రం అంతా తామే అన్నట్లుగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ‘మా పరిధిలో ఇన్ని సబ్స్టేషన్లు ఉన్నాయి. ఇన్ని ఆపరేటరు ఉద్యోగాలు ఇస్తాం. అంతా మేం చెప్పినట్లే ఉంటుంది. ముందుగా డబ్బులు ఇచ్చిన వారికే ప్రాధాన్యత’ అని నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఈ విషయంలో ఎన్పీడీసీఎల్ అధికారులు జోక్యం చేసుకుని నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. పోస్టుల వివరాలు డివిజన్ పేరు ఖాళీలు వరంగల్ 20 వరంగల్ రూరల్ 25 ములుగు 34 మహబూబాబాద్ 46 నర్సంపేట 22 జనగామ 83 పారదర్శకంగా నియామకాలు : శివరాం, వరంగల్ ఎస్ఈ సబ్‌స్టేషన్ ఆపరేటర్ల నియామకాలు పారదర్శకంగా జరుగాతాయి. మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా... విద్యుత్ స్తంభాలు ఎక్కగలిగే వారిని ఎంపిక చేస్తాం. ఎలాంటి పైరవీలకు, అక్రమాలకు తావు లేదు. బ్రోకర్లను నమొ్మద్దు. ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురావాలి. డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. -
కేబుల్ ఆపరేటర్లను అనుమానిస్తున్నారు
సెటాప్ బాక్సుల ధరలు ఒకేలా ఉండాలి కేబుల్ టీవీ ఆపరేటర్ల జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు పి.గన్నవరం : ఒకొక్క కంపెనీ సెటాప్ బాక్సు ఒక్కో రకంగా ఉండడం వల్ల, కేబుల్ ఆపరేటర్లను వినియోగదారులు అనుమానిస్తున్నారని కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు అడపా వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ టీవీ ఆపరేటర్ల సమస్యలపై ఈ నెలాఖరులో విజయవాడలో రాష్ట్ర స్థాయి సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో పి.గన్నవరం నియోజకవర్గ కేబుల్ టీవీ ఆపరేటర్ల సమావేశం జరిగింది. సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు ఉలిశెట్టి బాబీ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి వెంకట్రావు మాట్లాడుతూ కేబుల్ టీవీ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్పొరేట్ కంపెనీలు విక్రయిస్తున్న సెటాప్ బాక్సుల ధరలన్నీ ఒకేలా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి, భద్రత కల్పించాలని, రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని కోరారు. కేబుల్ ఆపరేటర్లతో పే చానల్స్ నిర్వాహకులు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని విడనాడాలని సమావేశం డిమాండ్ చేసింది. వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని తీర్మానించింది. సమావేశంలో సంఘ నాయకులు ఎస్.సూర్యనారాయణ, ఇడుపుగంటి రామ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
తొలి రోజు రూ. 60వేల కోట్ల బిడ్లు
- టెలికం స్పెక్ట్రం వేలం ప్రారంభం - ఆపరేటర్ల మధ్య తీవ్ర పోటీ - ఏపీలో 1800 మెగాహెట్జ్బ్యాండ్కి డిమాండ్ న్యూఢిల్లీ: ఆపరేటర్ల మధ్య తీవ్ర పోటీతో టెలికం స్పెక్ట్రం వేలం బుధవారం ప్రారంభమైంది. తొలి రోజున ఆరు రౌండ్లు జరగ్గా రూ. 60,000 కోట్ల మేర బిడ్లు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2జీ, 3జీ టెలికం సేవలకు ఉపయోగపడేలా నాలుగు బ్యాండ్లలో స్పెక్ట్రం వేలం వేస్తుండగా, 8 కంపెనీలు బరిలో ఉన్నాయి. ప్రస్తుత ఆపరేటర్లు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ తమ స్పెక్ట్రంను కాపాడుకునేందుకు కొత్త ఆపరేటరు రిలయన్స్ జియోతో పోటీపడుతున్నాయి. 2,100 మెగాహెట్జ్ బ్యాండ్ (3జీ సేవలకు ఉపయోగపడేది), 900 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంనకు మెరుగైన స్పందన కనిపించగా, 800 మెగాహెట్జ్ బ్యాండ్‌కి కూడా అనూహ్య స్థాయిలో ఆపరేటర్ల నుంచి ఆసక్తి వ్యక్తమైంది. అయితే, ముంబై, ఢిల్లీ, కర్ణాటక సర్కిళ్లలో 3జీ స్పెక్ట్రంనకు పెద్దగా బిడ్లు దాఖలు కాలేదు. ఆరో రౌండు ముగిసేసరికి ఆంధ్రప్రదేశ్‌లో 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌కి, హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, పంజాబ్ తదితర సర్కిళ్లలో 900 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంకి మంచి స్పందన లభించింది. వేలం వేసిన స్పెక్ట్రం రిజర్వ్ ధర రూ. 49,000 కోట్లు అయినప్పటికీ.. మొత్తం రూ. 60,000 కోట్ల పైచిలుకు బిడ్లు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. నేడు (గురువారం) కూడా వేలం కొనసాగనుంది. ఈ వేలం ద్వారా కనీసం రూ. 82,000 కోట్లు - రూ. 1లక్ష కోట్ల పైచిలుకు ప్రభుత్వ ఖజానాకు రాగలవని అంచనా. 2జీ టెలికం సేవలకు సంబంధించి 3 బ్యాండ్‌విడ్త్‌లలో మొత్తం 380.75 మెగాహెట్జ్ స్పెక్ట్రంతో పాటు, 3జీకి ఉపయోగపడే బ్యాండ్‌విడ్త్‌లో మరో 5 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కేంద్ర టెలికం విభాగం వేలం వేస్తోంది. -
ఆపరేటర్లకు మొండిచేయి
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ: సమగ్ర సర్వే వివరాలను నమోదుచేయించిన ప్రైవేట్ ఏజెన్సీ సంస్థ.. ఆపరేటర్లకు డబ్బులు ఇవ్వకుండానే చేయిచూపారు. హైదరాబాద్ నగరానికి సంబంధించిన సర్వే వివరాల నమోదు ప్రక్రియ స్థానిక అంబేద్కర్ కళాభవన్‌లో పూర్తయింది. కాంట్రాక్టు తీసుకున్న ఐసీడబ్ల్యూసీ ఏజెన్సీ వారు పని చేయించుకుని డబ్బులు అడిగితే అప్పుడు ఇప్పుడు.. అంటూ కాలయాపన చేశారు. తీరా పని పూర్తికాగానే అన్నీ సర్దుకుని వెళ్లిపోయారు. వివరాల్లోకెళ్తే.. ఆగస్టు 19న సమగ్రసర్వేలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన కుటుంబాల వివరాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేసేందుకు సుమారు రెండులక్షల ఫారాలను ఐసీడబ్ల్యూసీ ఏజెన్సీ ప్రతినిధులు జిల్లాకు తీసుకొచ్చారు. అయితే జిల్లాతోపాటు జీహెచ్ఎంసీ వివరాలను కూడా నమోదుచేసేందుకు 200 మంది ఆపరేటర్లు పనిచేశారు. వీరికి ఒక్కోఫారానికి రూ.ఆరు ఇస్తామని ఏజెన్సీవారు ఒప్పందం కుదుర్చుకున్నారు. వాస్తవంగా ప్రభుత్వం ఒక్కోఫారానికి రూ.16 చెల్లించింది. రాత్రింబవళ్లు కష్టపడి ఒక్కో ఆపరేటర్ సుమారు రెండువేల నుంచి మూడువేల కుటుంబాల వివరాలను కంప్యూటర్లో పొందుపరిచారు. అయితే వారికి చేసినపనికిగాను ఒక్కొక్కరికీ రూ.10వేల నుంచి రూ.15వేల వరకు డబ్బులు రావాల్సి వచ్చింది. అప్పుడు ఇప్పుడు ఇస్తామంటూ కాలయాపన చేసి న సదరు ఏజెన్సీ ప్రతినిధులు తీరా సోమవారం కంప్యూటర్లు, ఇతర వ స్తుసామగ్రిని తీసుకొని హైదరాబాద్‌కు పయనమైంది. విషయం తెలుసుకున్న కంప్యూట ర్ ఆపరేటర్లు అంబేద్కర్ కళాభవన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. చేసిన పనికి డబ్బు లు ఇవ్వాలని పట్టుబట్టారు. ఏజెన్సీ వారు కంప్యూటర్లను తదితర సామాగ్రిని తరలిస్తుండగా, డబ్బులు ఇవ్వకుండానే వెళ్లిపోతారా..? అంటూ నిలదీశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని ఆపరేటర్లు సిద్ధమయ్యారు. -
కొనుగోళ్లపై అన్నదాత ఆగ్రహం
- మహిళా సమాఖ్య ప్రతినిధుల నిర్బంధం - రెండు గంటల పాటు నిరసన - పజాప్రతినిధుల జోక్యంతో విడుదల సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం అన్నదాతకు ఆగ్రహం తెప్పించింది. రెండు రోజులుగా ఐకేపీ కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు నిలిచిపోవడం, అధికారులు స్పందించకపోవడంతో రైతన్న కోపం కట్టలు తెంచుకుంది. అది కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్న మహిళ సమాఖ్య ప్రతినిధులను రెండు గంటల పాటు గృహ నిర్భందించేంత వరకూ వెళ్లింది. ఈ సంఘటన బుధవారం మండల పరిధిలోని పుల్లూరులో చోటు చేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 2వ తేదీన పుల్లూరులో ఐకేపీ అధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 4 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసిన కేంద్రం నిర్వాహకులు, అందులోని 2,500 క్వింటాళ్లను ఎగుమతి చేశారు. రవాణా సమస్య కారణంగా మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలోనే నిల్వ ఉంచారు. ఇదే సమయంలో గత రెండు రోజులుగా చిరుజల్లులు కురవడంతో కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో ఈ రెండు రోజుల్లో రైతులు తెచ్చిన ధాన్యం నిల్వలతో కొనుగోలు కేంద్రం నిండిపోయింది. బుధవారం నాటికి సుమారు 6 వేల క్వింటాళ్ల ధాన్యం పుల్లూరు కొనుగోలు కేంద్రానికి చేరుకుంది. ధాన్యం నిల్వలు భారీగా చేరుకుంటున్నా, నిర్వాహకులు కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు నిలదీశారు. లారీల, వసతుల కొరత, తేమ శాతం లాంటి సమస్యలతో బుధవారం కూడా కొనుగోళ్లు చేపట్టలేమని నిర్వాహకులు చెప్పారు. దీంతో ఆగ్రహించిన అన్నదాత సంబంధిత మహిళా సమాఖ్య ప్రతినిధులను స్థానిక పాఠశాలలో సుమారు రెండు గంటల పాటు నిర్భందించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సరోజన అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. అనంతరం రైతులను సముదాయించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన రైతులు ఐకేపీ కేంద్ర నిర్వాహకులను విడుదల చేశారు