మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ: సమగ్ర సర్వే వివరాలను నమోదుచేయించిన ప్రైవేట్ ఏజెన్సీ సంస్థ.. ఆపరేటర్లకు డబ్బులు ఇవ్వకుండానే చేయిచూపారు. హైదరాబాద్ నగరానికి సంబంధించిన సర్వే వివరాల నమోదు ప్రక్రియ స్థానిక అంబేద్కర్ కళాభవన్‌లో పూర్తయింది. కాంట్రాక్టు తీసుకున్న ఐసీడబ్ల్యూసీ ఏజెన్సీ వారు పని చేయించుకుని డబ్బులు అడిగితే అప్పుడు ఇప్పుడు.. అంటూ కాలయాపన చేశారు. తీరా పని పూర్తికాగానే అన్నీ సర్దుకుని వెళ్లిపోయారు.
వివరాల్లోకెళ్తే.. ఆగస్టు 19న సమగ్రసర్వేలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన కుటుంబాల వివరాలను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసేందుకు సుమారు రెండులక్షల ఫారాలను ఐసీడబ్ల్యూసీ ఏజెన్సీ ప్రతినిధులు జిల్లాకు తీసుకొచ్చారు. అయితే జిల్లాతోపాటు జీహెచ్‌ఎంసీ వివరాలను కూడా నమోదుచేసేందుకు 200 మంది ఆపరేటర్లు పనిచేశారు. వీరికి ఒక్కోఫారానికి రూ.ఆరు ఇస్తామని ఏజెన్సీవారు ఒప్పందం కుదుర్చుకున్నారు. వాస్తవంగా ప్రభుత్వం ఒక్కోఫారానికి రూ.16 చెల్లించింది. రాత్రింబవళ్లు కష్టపడి ఒక్కో ఆపరేటర్ సుమారు రెండువేల నుంచి మూడువేల కుటుంబాల వివరాలను కంప్యూటర్‌లో పొందుపరిచారు.
అయితే వారికి చేసినపనికిగాను ఒక్కొక్కరికీ రూ.10వేల నుంచి రూ.15వేల వరకు డబ్బులు రావాల్సి వచ్చింది. అప్పుడు ఇప్పుడు ఇస్తామంటూ కాలయాపన చేసి న సదరు ఏజెన్సీ ప్రతినిధులు తీరా సోమవారం కంప్యూటర్లు, ఇతర వ స్తుసామగ్రిని తీసుకొని హైదరాబాద్‌కు పయనమైంది. విషయం తెలుసుకున్న కంప్యూట ర్ ఆపరేటర్లు అంబేద్కర్ కళాభవన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. చేసిన పనికి డబ్బు లు ఇవ్వాలని పట్టుబట్టారు. ఏజెన్సీ వారు కంప్యూటర్లను తదితర సామాగ్రిని తరలిస్తుండగా, డబ్బులు ఇవ్వకుండానే వెళ్లిపోతారా..? అంటూ నిలదీశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని ఆపరేటర్లు సిద్ధమయ్యారు.
ఆపరేటర్లకు మొండిచేయి
Published Tue, Sep 16 2014 1:41 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement